పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లిలో ఎంపీటీసీ మాజీ సభ్యురాలు మంజులారెడ్డి ఇంట్లో చోరీ విషయం శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. కొలమాసనపల్లెకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యురాలు మంజులారెడ్డి గురువారం కుటుంబసభ్యులతో కలిసి తన ఇంటికి తాళం వేసుకుని శాంతిపురంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయం గమనించిన దొంగలు అదేరోజు రాత్రి ఆ ఇంటి కిటికీని తొలగించి, ఇంట్లోకి వెళ్లి బీరువా తెరిచి చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఇంటికొచ్చిన బాధితురాలు చోరీ జరిగిన విషయం గుర్తించి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా బీరువాలోని 20 గ్రాముల బంగారం, అరకిలో వెండి, రూ.80 వేల నగదును చోరీకి గురైనట్టు బాధితురాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
శతాధిక వృద్ధుడి మృతి
బంగారుపాళెం: మండల కేంద్రంలో శుక్రవారం శతాధిక వృద్ధుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక బీసీ కాలనీలో నివాసముంటున్న సుబ్బానాయుడు(100) వయోభారం కారణంతో మృతి చెందాడు. ఈయన అక్టోబర్ 1924లో జన్మించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టణానికి చెందిన శతాధిక వృద్దుడు మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
అవార్డు గ్రహీతకు సత్కారం
చిత్తూరు కలెక్టరేట్ : వరల్డ్ బెస్ట్ అచీవర్ అవార్డు అందుకున్న రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ పొన్నా యుగంధర్‌కు సత్కారం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయనకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకులు మహేష్ మాట్లాడుతూ ప్రెస్‌క్లబ్ వెల్ఫేర్ వరల్డ్ వైడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్టణంలో అంతర్జాతీయ సామాజిక అవార్డుల కార్యక్రమం నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నా యుగంధర్ చేసిన సామాజిక సేవకు గాను వరల్డ్ బెస్ట్ అచీవర్ అవార్డు అందజేశారన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాఘవ, సాయి, కిషోర్, మహేష్ బాబు, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కొలమాసనపల్లిలో చోరీ
కొలమాసనపల్లిలో చోరీ