
యువకుడి ఆత్మహత్య
కుప్పం: పట్టణం చిత్తరంజని రోడ్డులోని ఓ ఇంట్లో యువకుడు ఆత్మహత్యకు పాల్పపడ్డిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసలు కథనం మేరకు.. కుప్పం పట్టణం చిత్తరంజని రోడ్డులో బాలసుబ్రమణ్యం శ్రాస్తీ వద్ద గుడుపల్లె మండలం కంచి బందార్లపల్లి గ్రామానికి చిరంజీవి పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం పనికి వచ్చినా చిరంజివి ఇంటి యాజమాని బాబుస్వామి బయటకు వెళ్లాలని పిలిచినా.. తాను రావడం లేదని ఇంట్లోనే ఉంటానని చెప్పి ఉండి పోయాడు. ఏమి జరిగిందో ఏమోకానీ చిరంజీవి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన యాజమాని తలుపు తట్టగా తెరవకపోవడంతో అనుమానం వచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు తీసి చూడగా ఇంట్లో చిరంజీవి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నాడు. ఈ మేరకు మృతుడి తల్లితండ్రులకు సమాచారం అందించారు. మృతుడి తల్లితండ్రులు, ఇంటి యాజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 57,863 మంది స్వామివారిని దర్శించుకోగా 31,030 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.04 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.