
ఆటోను ఢీకొన్న జేసీబీ
● తండ్రి కొడుకులకు తీవ్రగాయాలు
గుడిపాల: ఆటోను జెసీబీ ఢీ కొన్న ఘటనలో తండ్రి, కొడుకుతోపాటు మరో ఐదేళ్ల చిన్నారికి తీవ్రగాయాలైనట్టు గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. నగరి మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన రుషేంద్రబాబు(35) తిరుపతిలో బియ్యం వ్యాపారం చేసేవాడు. తమిళనాడు రాష్ట్రం వేలూరు నుంచి కందిపప్పు, ఉద్దిపప్పు తీసుకు వచ్చి తిరుపతిలో విక్రయించేవాడు. ఈ నేపథ్యంలో గుడిపాల మండలం పల్లూరు గ్రామంలో నూతనంగా బియ్యం దుకాణం పెట్టేందుకు ఏర్పాట్లు చేశాడు. శుక్రవారం కాణిపాకం గుడికి వెళ్లి పల్లూరులో బియ్యం దుకాణం ప్రారంభోత్సవానికి కుటుంబ సమేతంగా తనకు ఉన్న ఎలక్ట్రిక్ ఆటో ఏపీ 39 డబ్ల్యుడీ 2074లో వస్తుండగా గుడిపాల మండలంలోని అనుపు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఏపీ26 ఏజే6976 జేసీబీ ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో రుషేంద్రబాబుతోపాటు అతని కుమారుడైన భువనచంద్ర(5) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆటోను ఢీకొన్న జేసీబీ