
విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన
తిరుపతి సిటీ: స్వర్ణాంధ్ర –2047 సాధనలో భాగంగా సీఎం విజనరీకి అనుగుణంగా నియోజకవర్గాల అభివృద్ధి కోసం విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేయాలని డీఆర్వో నరసింహులు అధికారులను ఆదేశించారు. పద్మావతి మహిళా వర్సిటీలోని సావేరి సెమినార్ హాల్‌లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికారులకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై శుక్రవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, టీం సభ్యులు, నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే విధంగా పథకాలు రూపొందించాలని సూచించారు. వర్క్‌షాపులో ఏపీ ప్రణాళిక శాఖ సంచాలకులు రావి రాంబాబు, ప్రణాళికా శాఖ సీనియర్ సలహాదారు సీతాపతిరావు, సీపీఓ ప్రేమ్‌చంద్ర, తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు.