
ద్విచక్రవాహనాల చోరీ కేసులో వ్యక్తి అరెస్టు
కుప్పం: గుడుపల్లి మండలంలో రెండు రోజులుగా జరిగిన ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ మల్లేశ్ యాదవ్ తెలిపారు. మూడు రోజులు క్రితం గుడుపల్లిలో జరిగిన ద్విచక్ర వాహనాల చోరీ కేసు విచారణలో భాగంగా పొగురుపల్లె క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా చోరీకి గురైన వాహనాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. కుప్పం మండలం మోడల్ కాలనీకి చెందిన సతీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించాడని తెలిపాడు. అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కారు ఢీకొని ఒకరికి గాయాలు
పెద్దపంజాణి: చౌడేపల్లి–పుంగనూరు మార్గం మధ్యలోని మల్లసముద్రం వద్ద గురువారం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి తీ వ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. చౌడేపల్లి మండలం చారాల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు శ్రీనివాసులు రెడ్డి(మాజీ సైనికుడు)పెద్దపంజాణి మండలం రాజుపల్లి పంచాయతీ కమ్మినాయునిపల్లి సమీపంలోని హెచ్‌పీసీఎల్ పంపింగ్ స్టేషన్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పని ముగించుకుని, ఎలక్ట్రిక్ స్కూటర్‌లో స్వగ్రామం చారాలకు బయలు దేరాడు. మార్గం మధ్యలోని మల్లసముద్రం వద్ద పుంగనూరుకు వెలుతున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
వివాహిత ఆత్మహత్య
వెదురుకుప్పం: కుటుంబ కలహాల నేపథ్యంలో కొండకిందపల్లె గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కొండకిందపల్లె గ్రామంలోని హేమలత(29)కు, కార్వేటినగరం మండలం జాండ్లపేట గ్రామానికి చెందిన నరేష్‌కు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అయితే గత ఆరు నెలలుగా వారిద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నరేష్ విడాకులు ఇవ్వాలని కోరాడు. హేమలత కుటుంబ సభ్యులు ఒక్కటి చెయ్యాలని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోగా మనస్తాపం చెందిన హేమలత గురువారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ద్విచక్రవాహనాల చోరీ కేసులో వ్యక్తి అరెస్టు