
జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉషశ్రీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బుధవారం ఉషశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న అరుణ్‌కుమార్ రిటైర్డు అయ్యారు. ఈ మేరకు సూపరింటెండెంట్ బాధ్యతలను ఉషశ్రీకి అప్పగించారు. కాగా ఆమె బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రి నిర్వహణపై ఆమె అధికారులు, సిబ్బందితో మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు
– నూతన డీసీఈబీ కార్యదర్శిగా హేమాద్రి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని ప్రభు త్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జిల్లా ఉమ్మడి పరీక్ష ల విభాగం నూతన కార్యదర్శి హేమా ద్రి అన్నారు. నూతనంగా నియమితులైన ఆయన బుధవారం పీసీఆర్ ప్ర భుత్వ పాఠశాలలోని డీసీఈబీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ యన మాట్లాడుతూ డీసీఈబీ నియమ, నిబంధనల ప్రకారం పరీక్షల నిర్వహణ, విద్యార్థుల ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఆయనకు పలువురు హెచ్‌ఎంలు అరుణ్‌కుమార్, సోమశేఖర్‌రెడ్డి, రవీంద్రరెడ్డి, హుస్సేన్‌బాషా, భాస్కర్‌రావు, జ్యోతి ప్రసాద్, మాజీ కార్యదర్వి పరశురామ్‌నాయుడు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
బకాయిలు చెల్లించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. చిత్తూరు నగరంలోని ఆర్టీసీ–2 డిపోలో బుధవారం జరిగిన ఓప్రైవేటు కార్యక్రమానికి ఆయన హాజరై, మాట్లాడారు. 11 వ పీఆర్సీకి సంబంధించి 24 నెలలు అరియర్స్, నాలుగు డీఏలు, అరియర్స్ సరెండర్ లీవులు, లీవ్ ఎన్ క్యాష్‌లకు సంబంధించి రూ.వేల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ఒక్క బకాయి కూడా సర్వీసులో ఉన్న ఉద్యోగులు, ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు ఇవ్వడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బకాయిలను దశలవారీగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఉద్యోగుల ఆనందం ఆవిరైందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న 3,500 మంది ఉద్యోగోన్నతులు వెంటనే అమలు చేయాలన్నారు. ఖాళీలు ఉన్న డ్రైవర్లు, కండక్టర్ పోస్టులతోపాటు 10వేల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు అర్జున్, విజయ్‌కుమార మురళీధరన్, వి.ఎస్ మణి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉషశ్రీ