నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు

May 1 2025 1:52 AM | Updated on May 1 2025 1:52 AM

నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు

నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే ఒకటో తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన గ్రామీణ, మండల, జిల్లా కేంద్రాల్లో మొత్తం 48 శిక్షణ శిబిరాలను నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులకు వ్యాయామ విద్య, ఉపాధ్యాయులు, సీనియర్‌ క్రీడాకారులతోపాటు జిల్లా కేంద్రంలోని మెసానికల్‌ స్టేడియంలో సంబంధిత క్రీడా శిక్షకులతో ప్రాథమిక స్థాయి నుంచి వివిధ క్రీడల్లో తర్ఫీదు ఇవ్వనున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ శిబిరాల్లో క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తారు.

శిబిరాల వివరాలిలా..

క్రీడ శిక్షణ శిబిరాలు:

వాలీబాల్‌: గుడుపల్లి మండలం అగరం గ్రామం జెడ్పీ సంగనపల్లి, పుంగనూరు జెడ్పీ, జెడ్పీ రొంపిచెర్ల, జెడ్పీ కార్వేటినగరం, జెడ్పీ కుప్పం, జెడ్పీ గరిగచిన్నేపల్లి, జెడ్పీ పెద్దహరిజనవాడ కార్వేటినగరం, ప్రభుత్వ హైస్కూల్‌ చిత్తూరు, జెడ్పీ గంగవరం, కేవీకే నగరి, జెడ్పీ గుడిపాల, యాదమరి ఓపెన్‌ ప్లేస్‌, బంగారుపాళెం ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ ఇస్తారు.

టెన్నికాయిట్‌: కుప్పం మండల కేంద్రం ప్రభుత్వ హైస్కూల్‌.

బాస్కెట్‌బాల్‌: చిత్తూరు అర్బన్‌ బాస్కెట్‌ బాల్‌ కోర్టు మిట్టూరు–1, కేవీకే పలమనేరు, డీఎస్‌ఏ మైదానం చిత్తూరు, బంగారుపాళెం జెడ్పీ.

హాకీ: ఐరాల మండలం కాణిపాకం జెడ్పీ హైస్కూల్‌ , వి.కోట జెడ్పీ.

కబడ్డీ: నిండ్ర మండలం కొప్పేడు అంగన్‌వాడీ, చౌడేపల్లి జెడ్పీ హైస్కూల్‌, సదుం జెడ్పీ, పుంగనూరు అరడిగుంట.

సాఫ్ట్‌బాల్‌: ఐరాల జెడ్పీ హైస్కూల్‌, వెదురుకుప్పం ఆల్లమడుగు జెడ్పీ, జెడ్పీ పూతలపట్టు.

క్రికెట్‌: నగరి కేవీకే కేంద్రం, డీఎస్‌ఏ మైదానం చిత్తూరు.

పుట్‌బాల్‌: పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి జెడ్పీ హైస్కూలు, కేవీకే పలమనేరు, మెసానికల్‌ మైదానం.

వ్రెస్‌ట్లింగ్‌: మెసానికల్‌ మైదానం చిత్తూరు.

ఖోఖో: వి.కోట మండలం నెర్నిపల్లి జెడ్పీ, బంగారుపాళెం ఏపీటీడబ్ల్యూఎస్‌, తవణంపల్లి మండలం మిట్టపల్లి, యాదమరి మండలం కొట్టాలం జెడ్పీ, దుర్గానగర్‌కాలనీ మున్సిపల్‌ హైస్కూల్‌ చిత్తూరు, బైరెడ్డిపల్లి మండలం తీర్థం జెడ్పీ.

సద్వినియోగం చేసుకోవాలి

వేసవిలో నెల రోజుల పాటు నిర్వహించే శిక్షణ శిబిరాలను జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఉన్న చిన్నారులు సద్వినియోగం చేసుకునేలా చూడాలి. వేసవి శిక్షణ శిబిరాల్లో క్రీడా ప్రస్థానం ప్రారంభించిన చిన్నారులు భవిష్యత్‌లో ఎంతో మంచి క్రీడాకారులుగా ఎదిగారు. ఆయా క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, తమ ప్రాంతాల్లో చిన్నారులు ఈ శిక్షణ శిబిరాలకు హాజరయ్యేలా సహాయ సహకారాలు అందించాలి.

– బాలాజీ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, చిత్తూరు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement