
జిల్లా సమాచారం జిల్లాలోని మొత్తం చౌక దుకాణాలు 1,390 కార
రేషన్‌లో కోత పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సాకులు వెదుకుతోంది. ఈకేవైసీ చేయించుకోకపోతే ఏప్రిల్ మాసం నుంచి బియ్యం ఆగిపోనున్నాయి. ఈ సేవల కోసం కూలి పనులు వదులుకొని రోజంతా డీలర్ల వద్ద పడిగాపులు కాస్తున్నా నమోదు పూర్తి కావడం లేదు. మరోవైపు 5 ఏళ్లు దాటిన పిల్లలకు ఈకేవైసీ కావడం లేదు. వారికి ఆధార్ అప్‌డేట్ చేయించి ఈకేవైసీ చేయించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ పనుల కోసం చంటి బిడ్డలను వెంటబెట్టుకొని మండుటెండలో వీధుల వెంట తిప్పుతూ కేంద్రాల వద్ద ఎండలో పడిగాపులు పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈకేవైసీ సేవలు ఇంటి వద్దే గడప దాటకుండా అందేవని తలుచుకొని మహిళలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఈ సేవలకు ఆధార్ కేంద్రాల్లో ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేయడంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కూటమి ప్రభుత్వం ఈకేవైసీ నమోదు పేరుతో వేధిస్తోంది. ఈకేవైసీ చేయించుకోకుంటే రేషన్‌లో కోత పెడతానంటోంది. పారదర్శకత పేరుతో కార్డుదారులపై కత్తి పెడుతోంది. నమోదుకు ఈనెల 31న గడువు విధించింది. దీంతో రేషన్ కార్డుదారులతో పాటు ప్రధానంగా బాల ఆధార్ ఉన్న కుటుంబీకులకు ఆధార్ కష్టాలు వచ్చి పడ్డాయి. పిల్లల ఆధార్ అప్‌డేట్ కోసం ఆధార్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఇదే అదనుగా ఆధార్ కేంద్రాలు ఇష్టారాజ్యంగా డబ్బులు దండుకుంటున్నాయి. ఈకేవైసీ ఎక్కడైనా చేయించుకోవచ్చని అధికారులు చెబుతున్నా ఎక్కడా చేసే వారే లేరు.. కేవలం డీలర్ల వద్ద మాత్రమే చేస్తున్నారు. సచివాలయాలకు వెళితే డీలర్ల వద్దకు పంపిస్తున్నారు. డీలర్ల వద్దకు రోజు వారీ కూలీ పనులు పోగొట్టుకొని డీలర్లు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా నమోదు పూర్తి కాక అపసోపాలు పడుతున్నారు.
అవసరానికో రేటు..
రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలనే నిబంధన పెట్టింది. ఇప్పటి వరకు 16,70,470 మంది ఈకేవైసీ చేయించుకున్నారు. ఇంకా 1,76,941 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. అందుబాటులో ఉన్న లబ్ధిదారులు పనులు వదులుకొని ఈకేవైసీ కోసం క్యూ కడుతున్నారు. రేషన్ కోత పడుతోందనే భయంతో డీలర్లను చుట్టుముట్టేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడులో ఉన్న వ్యక్తులు పరుగున వచ్చి వేలిముద్రలు పెడుతున్నారు. అయితే ఇప్పడు ప్రధానంగా బాల ఆధార్ అంటే 5 ఏళ్లు దాటిన పిల్లలకు ఈకేవైసీ కష్టాలు వచ్చి పడ్డాయి. 5 ఏళ్లు దాటి వేలిముద్ర అప్‌డేట్ చేయించుకోని పిల్లలకు ఇప్పుడు ఈకేవైసీ వేధిస్తోంది. దీంతో ఆ పిల్లల తల్లిదండ్రులు ఆధార్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. కొందరు అన్ని చోట్ల రద్దీగా ఉండడంతో ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఒక వేళ ఆధార్ అప్‌డేట్ చేయించుకున్నా ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు రెండు నుంచి నాలుగు రోజుల సమయం తీసుకుంటోంది. ఇంతలో గడువు తీరితే పరిస్థితి ఏంటని పలువురు వాపోతున్నారు. తక్కువ సమయం ఇచ్చి అప్పటికప్పుడే ఈకేవైసీ చేయించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఇదే అదునుగా భావించి పలు ఆధార్ సెంటర్లు అదనపు వసూళ్లకు దిగాయి. కొన్ని చోట్ల అఫ్లికేషన్ ఛార్జ్ పేరుతో రూ. 60 నుంచి రూ. 100 వరకు వసూళ్లు చేస్తోంది. ఆధార్ అప్‌డేట్ కోసం రూ. 100 నుంచి రూ. 200 వరకు ఫీజు వసూళ్లు చేస్తున్నారు. చకచక కావాళ్లంటే రూ. 500 వరకు డిమాండ్ ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.
చిత్తూరు నగరం గిరింపేటలోని ఓ ఆధార్ సెంటర్ వద్ద లబ్ధిదారుల నిరీక్షణ
రేషన్‌కార్డుదారుల పడిగాపులు
ఈకేవైసీ పేరుతో రేషన్‌కు కోతలు
ప్రధానంగా ‘బాల ఆధార్’ కు కష్టాలు
డీలర్లను చుట్టుముడుతున్న లబ్ధిదారులు
ఆధార్ కేంద్రాల్లో అదనపు వసూళ్లు
ఈనెల 31న తుది గడువు
గతంలో ఇంటి వద్దే ఈకేవైసీ సేవలు
అనర్హులకు అందుతున్నాయనే అనుమానం
జిల్లాలో 1390 చౌక దుకాణాల కింద 5.40 లక్షల రేషన్ కార్డుదారులున్నారు. ఈ కార్డుల కింద 18,47,411 మంది ఉన్నారు. పారదర్శకత పేరుతో జాతీయ సమాచార సంస్థ ఆధ్వర్యంలో స్టాఫ్‌వేర్‌ను నవీకరిస్తున్నారు. ఇప్పటి వరకు రేషన్‌కార్డుదారులకు ఈకేవైసీ లేకున్నా సరుకులు ఇచ్చేవారు. ఇకపై అలా కుదరదని, నమోదు చేసుకోని వారికి రేషన్ కోత పడుతుందని అధికారులు చెబుతున్నారు. మృతులు, పలువురు ఉద్యోగులకు రేషన్ అందుతోందనే అనుమానంతో రేషన్ పంపిణీలో భారాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈకేవైసీని తప్పనిసరి చేసింది. తద్వారా ఈనెల 19 నుంచి అన్ని డీలర్ షాప్‌ల్లో ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత 23వ తేదీ వరకు గడువు విధించింది. తర్వాత ఈనెలాఖరు వరకు గడువు పొడిగించింది.
గతంలో ఇంటికే వచ్చేవారు..
ఈకేవైసీ, ఇతర ప్రక్రియలకు గతంలో ఇంటి వద్దకే వచ్చేవారని, ఇప్పుడు అక్కడికి..ఇక్కడికి తాము పరుగులు పెట్టాల్సి వస్తోందని పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు వలంటీర్లు తలుపు తట్టి సేవలు అందించారంటున్నారు. రేషన్, పింఛన్, వైద్యసేవలు, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత ఇతర సేవలకు ఇంటి గడపదాటి వెళ్లే వారు కారని, సాయంత్రం, ఉదయం వేళ్లలో ఈ పనులు ముగించుకుని..తమ పనులు చూసుకుంటుండేవారని ప్రజలు చెబుతున్నారు. ఇప్పడు ప్రతి దానికి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదని వాపోతున్నారు. బయట ఉండి రాలేని పరిస్థితుల్లో ఉంటే వలంటీర్లు అక్కడికే వెళ్లి సేవలు అందించారంటున్నారు. ఇప్పడు పరిస్థితి ప్రతి పనికి తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.
ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిందే..
కార్డులోని ప్రతి సభ్యుడు కచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఇది ఏ డీలర్ ద్వారా అయినా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 16,70,740 మంది ఈకేవైసీ చేయించుకున్నారు. మిగిలిన వారందరూ త్వరితగతిన చేయించుకోవాలి. 5 ఏళ్లలోపు ఉన్న వారికి ఈకేవైసీ అవసరం లేదు. 5 ఏళ్లు దాటిన వారు చేయించుకోవాలి. దీనిపై ఎలాంటి అనుమానాలు వద్దు.
– శంకరన్, డీఎస్‌ఓ, చిత్తూరు

జిల్లా సమాచారం జిల్లాలోని మొత్తం చౌక దుకాణాలు 1,390 కార

జిల్లా సమాచారం జిల్లాలోని మొత్తం చౌక దుకాణాలు 1,390 కార