శతాబ్దాల ఉత్సవం.. | - | Sakshi
Sakshi News home page

శతాబ్దాల ఉత్సవం..

Mar 25 2025 1:34 AM | Updated on Mar 25 2025 1:31 AM

● నేటి నుంచి శ్రీసుగుటూరు గంగమ్మ జాతర
పురజనుల ఉత్సాహం

పుంగనూరులో జాతరకు ముస్తాబైన జమీందారుల ప్యాలెస్‌

శతాబ్దాలుగా సాగుతున్న ఉత్సవం..కుల మతాలకతీతం..చిన్నా పెద్దా లేడా లేకుండా పురజనులకు ఉత్సాహం.. జమిందార్ల ఆధ్వర్యంలో నిర్వహించే జాతర వైభవం.. అదే ఆరోగ్యప్రదాయిని.. భక్తుల పాలిట కల్పవల్లి.. సుగుటూరు గంగమ్మ తల్లి జాతర. ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే ఈ పండుగపై కథనం.

పుంగనూరు: పరశురామ క్షేత్రంగా ఆవిర్భవించి.. పుంగపురిగా మారి..కాలక్రమేణ పుంగనూరుగా రూపాంతరం చెందింది ఈ పట్టణం. గౌని వంశానికి చెందిన ఇమ్మడి తిమ్మరాయల సంతతే పుంగనూరు జమిందార్లు అని చరిత్ర చెబుతోంది. నాటి జమిందార్లు 18వ శతాబ్దం పూర్వార్థంలో ప్రారంభించిన సుగుటూరు గంగమ్మ జాతర నేటికీ ఏటా వారి వంశస్తుల ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ఆరోగ్య ప్రదాయినిగా, భక్తుల పాలిట కల్పవల్లి పేరొందిన సుగుటూరు గంగమ్మ జాతర హోలీ తరువాత జిల్లాలో జరిగే అతి పెద్ద జాతరగా పేరుగాంచింది. పుంగనూరులో కులమతాలకతీతంగా సు మారు ఎనిమిది శతాబ్దాలుగా జమీందారు ల కులదైవమైన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం రాత్రి అ మ్మవారికి జమీందారి కుటుంబీకులు రాజ సోమశేఖర్‌ చిక్కరాయుల్‌, రాజా మల్లికార్జు న చిక్కరాయల్‌, వారి కుటుంబీకులు ప్యాలె స్‌లో తొలిపూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణమ్మ దంపతులు, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి దర్శించు కుని పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేయడం ఆనవా యితీ. అనంతరం అమ్మవారిని ప్యాలెస్‌ నుంచి తీసుకొచ్చి, పురవీధుల్లో ఊరేగిస్తారు. వేలాది మంది భక్తు లు హాజరై, ఊరేగింపులో అమ్మవారికి జంతుబలులు సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటారు. బుధవారం ఉదయం అమ్మవారిని ప్యాలెస్‌ ఆవరణలోని ఆలయంలో కొలువు దీర్చి, వేకువజామున జమీందారి కుటుంబీకులు తొలిపూజలు నిర్వహించి, భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. అదే రోజు రాత్రి అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. ప్యాలెస్‌ ఆవరణలో జమీందారుల ఆధ్వర్యంలో మంగళవారం గొర్రెల సంత నిర్వహిస్తారు.

ఏర్పాట్లు

ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే జాతరకు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు రానున్నారు. కాగా జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి, చైర్మన్‌ అలీమ్‌బాషా, పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. చలివేంద్రాలు, వైద్యశిబిరా లు, విద్యుత్‌ దీపాలు, సీసీ కెమెరాలు, ఆలయ ప్రాంగణంలో బ్యారీకెడ్లు, షామీయానాలు ఏర్పాటు చేశారు. 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ ప్రభాకర్‌ తెలిపారు.

పుంగనూరు శ్రీ సుగుటూరు గంగమ్మ

జాతర ఏర్పాట్ల పరిశీలన

పుంగనూరులో జరుగుతున్న శ్రీసుగుటూరు గంగమ్మ జాత ర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు. సోమవారం రాత్రి ఆయన పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్‌తో కలసి ప్యాలెస్‌లోకి వెళ్లారు. అక్కడ జమీందారి కుటుంబీకులను కలసి అమ్మవారి ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాలపై చర్చించారు. ప్యాలెస్‌లో భక్తుల రద్దీ లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. రద్దీ సమయంలో చైన్‌ స్నాచర్లు, జేబు దొంగల కట్టడితోపాటు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈయన వెంట ఎస్‌బీ సీఐ భాస్కర్‌, సీఐలు రామ్‌భూపాల్‌, ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు.

శతాబ్దాల ఉత్సవం..1
1/2

శతాబ్దాల ఉత్సవం..

శతాబ్దాల ఉత్సవం..2
2/2

శతాబ్దాల ఉత్సవం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement