బంగారుపాళెం: అటవీశాఖ అధికారులు ఏనుగుల దా నులను ఆరికట్టి రైతుల పంటను కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. బుధవా రం మండలంలోని బోడబండ్లలో ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన బాధిత రైతులు సురేష్, కృష్ణయ్య, సంజీవి, భాస్కర, గోవిందు, ఈశ్వర్, శీను, లలిత, కృష్ణయ్య, మునేంద్ర, వెంకటప్ప, చంద్రయ్య, నాగభూషణం, సుధాకర్, సుబ్రమణ్యం, రామకృష్ణ, రాజేంద్ర, రవి, లోకనాథం మందడి పొలాలను సీపీఐ నాయకులు పరిశీలించారు. అనంతరం బాధిత రైతులతో కలసి స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీసీఐ సీనియర్ నాయకుడు మణి, జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి చంద్ర, జిల్లా కౌన్సిల్ సభ్యులు కుమారి, రఘు రైతులు పాల్గొన్నారు.
ఏనుగుల దాడులను అరికట్టాలి