ఇస్కాఫ్‌ జిల్లా కమిటీ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఇస్కాఫ్‌ జిల్లా కమిటీ ఎంపిక

Mar 16 2025 1:55 AM | Updated on Mar 16 2025 1:51 AM

చిత్తూరు కార్పొరేషన్‌ : ఇస్కాఫ్‌ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్‌రావు తెలిపారు. శనివారం చిత్తూరులో భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కాఫ్‌) 4వ మహాసభలో కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా ఏ.ఆర్‌.సౌందర్‌ రాజన్‌, జిల్లా కార్యదర్శి ఎం.నాగముని, జిల్లా సహాయ కార్యదర్శి దుర్గ, జిల్లా ఉపాధ్యక్షుడిగా చంద్రయ్య, కోశాధికారి బాలాజీ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1941లో ఫ్రెండ్స్‌ ఆఫ్‌ సోవియట్‌ యూనియన్‌ పేరుతో మహాత్మా గాంధీ, నెహ్రూ, సరోజినీ నాయుడు ఇతర నాయకుల సహకారంతో ప్రారంభమైందన్నారు. 1952లో ఇండోస్‌ సోవియట్‌ సాంస్కృతిక సంఘంగా మారిందన్నారు. సంస్థకు జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్య, జస్టిస్‌ బీ.పీ.జీవన్‌ రెడ్డి, రాజ్యసభ మాజీ ఎం.పీ.సయ్యద్‌ అజిత్‌ బాషా ప్రముఖులు జాతీయ స్థాయిలో పనిచేశారని కొనియాడారు, ప్రపంచ శాంతికి తోడ్పడటం, ఆర్థిక సంక్షోభాలను అధిగమించడం, ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ పూర్వక సంబంధాలు పెంపొందించడం కోసం ఇస్కాఫ్‌లో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రయ్య, నాగమణి, సౌందర్‌ రాజన్‌ , నాగరాజు పాల్గొన్నారు.

మాతా శిశు ఆరోగ్యమే లక్ష్యం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : మాతా శిశు ఆరోగ్యమే లక్ష్యంగా పని చేయాలని స్టేట్‌ ఎంసీహెచ్‌ నోడల్‌ అధికారి అనిల్‌ ఆదేశించారు. చిత్తూ రు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశా ఖ కార్యాలయంలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో స మీక్షించారు. మాతా శిశు సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విధిగా పాటించాలన్నారు. గర్భిణులు , బిడ్డకు ఆరోగ్య సేవలను అందించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వద్దన్నారు. పుట్టిన బిడ్డను పీహెచ్‌సీ వైద్యులు పర్యవేక్షించాలన్నారు. మాతా శిశు మరణాల నివారణకు కృషి చేయాలన్నారు. జాతీయ ఆ రోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి, జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్‌ ఉన్నారు.

మాట్లాడుతున్న శ్రీధర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement