● హత్య ఘటనపై పుంగనూరు సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

● హత్య ఘటనపై పుంగనూరు సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

Mar 16 2025 1:54 AM | Updated on Mar 16 2025 1:51 AM

మొన్న అభినందన.. నిన్న అభిశంసన

చిత్తూరు అర్బన్‌/పుంగనూరు : పుంగనూరు సీఐ శ్రీనివాసులు, హెడ్‌ కానిస్టేబుల్‌ సుబ్రమణ్యంను సస్పెండ్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పుంగనూరు మండలం ఒంటిమిట్ట గ్రామంలో శుక్రవారం రాత్రి లక్ష్మీనరసింహ స్వామి ఊరేగింపులో వెంకటరమణ, రామకృష్ణ కుటుంబాలు గొడవ పడ్డాయి. ఈ క్రమంలో శనివారం రామకృష్ణ హత్యకు గురయ్యాడు. ఈ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని డీఐజీ నుంచి ఆదేశాలు రావడంతో.. ఎస్పీ మణికంఠ ప్రాథమికంగా విచారించారు. సీఐ నిర్లక్ష్యంతో పాటు హెడ్‌ కానిస్టేబుల్‌ పనితీరు బాగలేదని ఎస్పీ నివేదిక ఇచ్చారు. దీంతో వీరిద్దరినీ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా రెండు రోజుల కిందట చిత్తూరులో జరిగిన నేర సమీక్ష సమావేశంలో.. సీఐ శ్రీనివాసులు తన ఉత్తమ పనితీరుకు గానూ ఎస్పీ మణికంఠ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. సరిగ్గా 24 గంటలు ముగిసేరికి ఆయన్ను విధుల నుంచి సస్పెండ్‌ చేయడం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. కేవలం అధికారపార్టీ సానుభూతిపరులకు ఏదైనా జరిగితే ఒకలా.. ప్రతి పక్ష పార్టీ మద్దతుదారులపై దాడులు జరిగితే మరోలా వ్యవహరిస్తుండం విమర్శలకు తావిస్తోంది.

పోలీసుశాఖలో ‘స్వచ్ఛాంధ్ర’

చిత్తూరు అర్బన్‌ : నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయం, ఆర్ముడు రిజర్వు కార్యాలయం, పోలీస్‌ స్టేషన్లలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరులోని పోలీసు కార్యాలయంలో ఏఎస్పీలు రాజశేఖర్‌రాజు, శివానంద కిషోర్‌ కలిసి మొక్కలు నాటారు. ఏఆర్‌ డీఎస్పీ మహబూబ్‌బాష, ఆర్‌ఐ సుధాకర్‌ పాల్గొన్నారు.

● హత్య ఘటనపై పుంగనూరు సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ సస్పెన్ష1
1/1

● హత్య ఘటనపై పుంగనూరు సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ సస్పెన్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement