బోయకొండకు రూ.1.12 కోట్ల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

బోయకొండకు రూ.1.12 కోట్ల ఆదాయం

Mar 12 2025 8:02 AM | Updated on Mar 12 2025 7:58 AM

చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయంలో వివిధ హ క్కుల నిర్వహణకు నిర్వహి ంచిన వేలం పాటల ద్వారా ఆలయానికి రూ.1.12 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. కొండపై క్యాంటీన్‌, ఐస్‌ క్రీమ్‌, కూల్‌ డ్రింక్స్‌ విక్రయించుకునే హక్కును రూ.20. 90 లక్షలు హెచ్చుపాటతో మల్లికార్జుననాయుడు కై వసం చేసుకొన్నారు. కొండ కింద క్యాంటీన్‌, ఐస్‌క్రీమ్‌, కూల్‌ డ్రింక్స్‌ విక్రయించుకునే హక్కును రూ.6.35 లక్షలకు రామకృష్ణ, అలాగే కొండపై ఉన్న నాలుగు దుకాణాల్లో పవిత్రధారాలు, బొమ్మలు, ఫొటోలు, కలకండ, వగైరా విక్రయించుకును హక్కును రూ.69 లక్షలకు మల్లికార్జుననాయుడు దక్కించుకున్నారు. కోళ్లు విక్రయించుకునే హక్కును రూ.6.80 లక్షలకు లవకుమార్‌, ఆలయం వద్ద ఫొటోలు తీసుకునే హక్కును రూ.1.79 లక్షలకు కిరణ్‌ సొంతం చేసుకున్నారు. కొబ్బరి పైచిప్పలు సేకరించుకునే హక్కును రూ.7.40 లక్షల హెచ్చుపాటతో రామకృష్ణ దక్కించుకున్నట్లు ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ శశిధర్‌, సూపరింటెండెంట్‌ రామనాథం తదితరులు పాల్గొన్నారు. కొన్ని వేలం పాటల్లో పాటదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కొన్నింటిని వాయిదా వేసినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. పాదరక్షలు భద్రపరుచుకునే హక్కు, పేపరు కవర్లు, బ్యాగులు విక్రయించుకునే హక్కులను వాయిదా వేసినట్లు ఈఓ ప్రకటించారు. వాయిదా పడిన వేలం పాటలను ఈనెల 20వ తేదీ తిరిగి నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement