చిత్తూరు కార్పొరేషన్: యువత సమస్యలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వ హించనున్న యువతపోరు కార్యక్రమానికి యు వత తరలిరావాలని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పిలుపునిచ్చారు. యువతపోరు కార్యక్రమంపై మంగళవారం నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మా ట్లాడారు. ఉదయం 9 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్బావ వేడుకలు నిర్వహించనున్నామన్నారు. అనంతరం అమూల్ డెయిరీ వద్దకు చేరుకుంటామన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్ప, జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలిసి ర్యాలీగా వేలాది మందితో కలెక్టరేట్ వద్దకు నినాదాలు చేసుకుంటూ వెళతామన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగభృతి ఇవ్వాలని, మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేయడం ఉపసంహరించుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అమూల్ డెయిరీ వద్దకు 9.30 గంటలకు చేరుకోవాలన్నారు. అందరూ పాల్గొన్ని కార్యక్రమాన్ని జయపద్రం చేయాలని పిలుపునిచ్చారు.