● మాజీ మంత్రి పెద్దిరెడ్డితోపాటు నియోజకవర్గ సమన్వయకర్తల రాక ● పోస్టర్‌ను ఆవిష్కరించిన చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్
చిత్తూరు కార్పొరేషన్: ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను ఘోరంగా మోసం చేసి, నట్టేట ముంచిందని వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆ రోపించారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులతో కలిసి యువతపోరు పోస్టర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఇటీవల నియోజకవర్గంలో పదవులు పొందిన నాయకులతో కార్యక్రమం సమయాత్తంపై టెలి కాన్ఫ రెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అమూల్ డెయిరీ వద్దకు చేరుకుంటామన్నారు. అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్ప, జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలిసి ర్యాలీగా వేలాది మందితో కలెక్టరేట్ వద్దకు చేరుకుంటామన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్, నిరుద్యోగభృతి ఇవ్వాలని, మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేయడం ఉపసంహరించుకోవాలన్న ప్రధాన డిమాండ్లతో ధర్నా చేస్తామని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా ప్రభ్వుతం్వ వారిని ఇబ్బందులు పెడుతుందని చెప్పారు. విద్యార్థులకు అండగా నిలవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు యువతపోరుకు సమాయత్తమవుతున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వ తుగ్ల క్ పాలనలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గాయత్రీదేవి, లీనారెడ్డి విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనజీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రజలను మభ్యపెట్టే మాటలతో మంత్రి నారా లోకేష్ కాలయాపన చేస్తున్నారని పార్టీ మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ మండిపడ్డారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా జగనన్న పాలన సాగించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు సజావుగా అందేవని పార్టీ చిత్తూరు నగర, గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల అధ్యక్షులు కేపీ శ్రీధర్, ప్రకాష్, జయపాల్ గుర్తు చేశారు. ముఖ్యంగా విద్యార్థుల అభ్యున్నతికి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విశేష కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బాబునాయుడు, పార్టీ మహిళ విభా గం చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షురాలు అంజలిరెడ్డి, యువజన విభాగం చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు మనోజ్‌రెడ్డి, విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు విష్ణు, నాయకులు స్టాన్లీ, భాగ్యలక్ష్మి, నారాయణ, మనోహర్‌రెడ్డి, హరీషారెడ్డి, రమణ, నౌషద్, రంజిత్, రాజేష్, అజిత్, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.