సంగీత తపస్వి గరిమెళ్ల ఆధ్యాత్మిక గుబాళింపుగా ప్రాశస్తి చెందిన అన్నమయ్య సంకీర్తనలనే జీవితంగా మలుచుకున్నారు.
అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ
వివిధ శాఖలకు సంబంధించిన అవగాహన పోస్టర్లను కలెక్టర్, జేసీలు సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
● చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం బొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన విభిన్నప్రతిభావంతురాలు నాగమ్మ సోమవారం కలెక్టరేట్‌కు విచ్చేసింది. ఆమెకు 2023–24లో గత వైఎస్సార్‌సీపీ సర్కారు హయాంలో స్థలంతో పాటు ఇల్లు మంజూరు అయ్యింది. ఆమె సొంతింటిని పునాదులు, గోడల వరకు నిర్మించుకుంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు ఆపేశారు. దీంతో సగంలో ఆగిపోయిన ఇంటి నిర్మాణానికి బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ వ్యయప్రయాసలతో నాగమ్మ కలెక్టరేట్‌కు విచ్చేసింది. ఈమె సమస్యను సంబంధిత గ్రామ సచివాలయ సిబ్బంది వద్దనే ఇచ్చి పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంది. అయితే అలా కాకుండా ఆమె బొమ్మాయిపల్లి నుంచి చిత్తూరు కలెక్టరేట్‌కు 30 కిలోమీ వరకు వ్యయప్రయాసలతో విచ్చేసింది. అక్కడ వినే వారులేకే ఇక్కడికి రావాల్సి వచ్చింది.
● చిత్తూరు జిల్లా సోమల మండలం సోమల గ్రామానికి చెందిన ముస్లింలు సయ్యద్‌బాషా, ముబారక్‌బాషాలు 69 కిలోమీటర్లు ప్రయాణం చేసి, తమ సమస్యను విన్నవించుకునేందుకు సోమవారం కలెక్టరేట్‌కు విచ్చేశారు. 75 ఏళ్లుగా సర్వే నంబర్ 130/5 లో 56 సెంట్ల భూమిని శ్మశానవాటికగా ఆ ముస్లింలు వినియోగించుకుంటున్నారు. ఆ శ్మశాన స్థలం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సోమల తహసీల్దార్‌ను కలిసి పలుసార్లు అర్జీలు ఇచ్చారు. ఆ తహసీల్దార్ వారికి కచ్చితమైన సమాధానం ఇచ్చి ఉంటే వారు కలెక్టరేట్‌కు వచ్చేవారు కాదు. ఆయన ఇవ్వకపోవడంతో కలెక్టరేట్‌కు పరుగులు పెట్టాల్సివచ్చింది.
జిల్లా సమాచారం
రూరల్ గ్రామ సచివాలయాలు : 504
అర్బన్ సచివాలయాలు : 108
రూరల్‌లో పనిచేస్తున్న
ఉద్యోగులు: 5,040
అర్బన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు: 1,080
రూరల్‌లోని సచివాలయ క్లస్టర్లు: 7,728
అర్బన్‌లోని సచివాలయ
క్లస్టర్లు: 1,618
రూరల్‌లోని కుటుంబాలు: 4,65,970
అర్బన్‌లోని కుటుంబాలు: 1,01,121
రూరల్‌లోని జనాభా: 14,58,318
అర్బన్‌లోని జనాభా: 3,22,780
ఇఫ్తార్ సహర్
మంగళవారం (సా) బుధవారం (ఉ)
చిత్తూరు 6–28 5–03
పుంగనూరు 6–30 5–07
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. గ్రామాభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని బాపూజీ కలలుగన్నారు. గత వైఎస్సార్ సీపీ సర్కారు ఆ కల సాకారానికి గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది. క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహాత్మాగాంధీ కలలకు తూట్లు పొడుస్తోంది. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. సర్వేల పేరుతో సిబ్బంది ని ఊరూరా తిప్పుతోంది. క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో లేక ప్రతి చిన్న సమస్యకూ ప్రజలు సుదూర ప్రాంతంలోని కలెక్టరేట్‌కు పరుగులు పెట్టేలా చేస్తోంది. ఏం చేయాలో తెలియక.. తమ బాధలు ఎక్కడ ఎవరికి చెప్పుకోవాలో అర్థంగాక జనం నలిగిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ సచివాలయవ్యవస్థను ని ర్వీర్యం చేసేందుకు కూటమి సర్కారు కుట్రలు పన్ను తోంది. ఫలితంగా జనం ప్రతి చిన్న సమస్య పరిష్కా రం కోసం జిల్లా కేంద్రానికి పరుగులు పెట్టాల్సి వస్తోంది. గత వైఎస్సార్‌సీపీ సర్కారు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల సమస్యల పరిష్కరించడంతోపాటు సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేర్చేందుకు గ్రామ స చివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఈ వ్యవస్థతో ప్రజలకు ఎంతో మేలు కలిగింది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు సచివాలయ వ్యవస్థను క్రమేణా నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తోంది. సచివాలయ ఉద్యోగులకు వివిధ సర్వేల పేరుతో పని ఒత్తిడి పెట్టి ప్రజల సేవలకు దూరం చేస్తోంది. ఫలితంగా ప్ర జల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల నుంచీ ఇదే తంతు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. దీంతో ప్రతి సోమవారం దాదాపు 500 మంది వరకు జి ల్లాలోని పలు మండలాల నుంచి కలెక్టరేట్‌కు సమస్య ల పరిష్కారం కోసం పోటెత్తుతున్నారు. ఎలాగో మండల స్థాయి లోనైనా ప్రజల సమస్యలు పరిష్కారం అ వుతాయా? అని అనుకుంటే అక్కడ కూడా ప్రజలకు న్యాయం జరగడం లేదు. ప్రజలకు మేలు కోరి ఏర్పా టు చేసిన గ్రామ సచివాలయాలను నిర్వీర్యం చేస్తున్న కూటమిపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
సచివాలయాల్లో అడ్రస్‌లేని ‘వేదిక’
సచివాలయాల్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కా ర వేదిక కార్యక్రమం జరగలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి సోమవారం సచివాలయ ఉ ద్యోగులందరూ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండి, స్పందన కార్యక్రమం నిర్వహించి, ప్రజా సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిలిపివేసింది. దీంతో ప్రజలు చేసేదేమి లేక ప్రతి సోమవారం వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్‌కు విచ్చేస్తున్నారు. అధికారులకు తమ సమస్యలు మొరపెట్టుకుంటున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదు. కలెక్టర్, జేసీలు వేదికలో వచ్చిన ప్రజల వినతు లు పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశిస్తున్నప్పటికీ ఏమీ పట్టనట్టుగా మిన్నకుండిపోతున్నా రు. ప్రజలు మాత్రం ప్రతి సోమవారం జిల్లా కేంద్రానికి విచ్చేసి సమస్యలు చెప్పుకుంటూనే ఉన్నారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ప్రతి చిన్న సమస్యకూ.. కలెక్టరేట్‌కే
గ్రామ, మండల స్థాయిల్లో అమలు కాని ప్రజాసమస్యల వేదిక
వ్యయప్రయాసలకోర్చిజిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజలు
గత వైఎస్సార్‌సీపీ సర్కారు పాలనలో గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కారం
సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కూటమి కుట్రలు
పెదవి విరుస్తున్న జిల్లా ప్రజానీకం
పట్టించుకుంటే ఇంత దూరమెందుకొస్తాం!
మాది పెనుమూరు మండలం బొంతివంక గ్రామం. మా పాపకు ప్రస్తుతం 27 సంవత్సరాల వయస్సు. చిన్నతనంలోనే పోలియో వ్యాధి సోకింది. మా పాపకు ప్రస్తుతం రూ.6 వేలు పింఛన్ ఇస్తున్నారు. ఆ నగదు మా పాప చికిత్సకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఈ విషయాన్ని మండల అధికారులకు చె ప్పినా న్యాయం జరగలేదు. దీంతో మా పాప కు రూ.15 వేలు పింఛన్ ఇప్పించాలని వేడు కునేందుకు వచ్చాం. ఉదయం నుంచి కలెక్టరేట్‌లో పాపతో నిరీక్షించి కలెక్టర్‌కు మా బాధ ను చెప్పుకున్నాం. గ్రామ, మండల అధికారులు పట్టించుకుని, న్యాయం చేస్తే ఇంత దూరం ఎందుకొస్తామయ్యా.
– బాలికతో తల్లి మణిమాల
నీ శరణిదే జొచ్చితిని!
నీ శరణిదే జొచ్చితిని!
నీ శరణిదే జొచ్చితిని!
నీ శరణిదే జొచ్చితిని!
నీ శరణిదే జొచ్చితిని!
నీ శరణిదే జొచ్చితిని!
నీ శరణిదే జొచ్చితిని!
నీ శరణిదే జొచ్చితిని!