సేవాసైన్యం..రాజీనామా పర్వం | Sakshi
Sakshi News home page

సేవాసైన్యం..రాజీనామా పర్వం

Published Sat, Apr 13 2024 12:35 AM

పుత్తూరులో మున్సిపల్‌ కమిషనర్‌కు రాజీనామా పత్రాలు అందిస్తున్న వలంటీర్లు 
 - Sakshi

వలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తమపై విషం కక్కిన టీడీపీ నేతలపై సైవాసైన్యం మండిపడుతోంది. కూటమి పార్టీల వైఖరిపై తీవ్ర నిరసన వెలిబుచ్చుతోంది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా విధులు నిర్వర్తిస్తుంటే అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సంక్షేమ పథకాలు లబ్ధిదారుల దరి చేరకుండా అడ్డుపడడం దారుణమని విమర్శిస్తోంది. అసత్య ఆరోపణలతో మనస్తాపానికి గురి చేసిన పచ్చనేతలకు తమ రాజీనామాలే సమాధానమని స్పష్టం చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం జిల్లాలోని పలు మండలాల్లో వలంటీర్లు స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగారు. ఒక్కరోజే మొత్తం 304 మంది తమ రాజీనామాలను సమర్పించారు. అందులో రొంపిచెర్ల మండలం నుంచి 126 మంది, పులిచెర్ల నుంచి 15 మంది, గంగవరం నుంచి 24 మంది, పుత్తూరు నుంచి 34 మంది, బైరెడ్డిపల్లె నుంచి 26 మంది, చౌడేపల్లె నుంచి 49 మంది, పలమనేరు మండల నుంచి 33 మంది ఉన్నారు.

– రొంపిచెర్ల, పులిచెర్ల, గంగవరం, పుత్తూరు, బైరెడ్డిపల్లె, చౌడేపల్లె, పలమనేరు

రొంపిచెర్లలో..
1/9

రొంపిచెర్లలో..

రొంపిచెర్లలో..
2/9

రొంపిచెర్లలో..

రొంపిచెర్లలో..
3/9

రొంపిచెర్లలో..

గంగవరంలో..
4/9

గంగవరంలో..

పులిచెర్లలో..
5/9

పులిచెర్లలో..

 బైరెడ్డిపల్లెలో..
6/9

బైరెడ్డిపల్లెలో..

చౌడేపల్లెలో..
7/9

చౌడేపల్లెలో..

పలమనేరులో..
8/9

పలమనేరులో..

చౌడేపల్లెలో..
9/9

చౌడేపల్లెలో..

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement