ఆదర్శమూర్తి బాబూ జగ్జీవన్‌ రామ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదర్శమూర్తి బాబూ జగ్జీవన్‌ రామ్‌

Apr 6 2026 7:42 AM | Updated on Apr 6 2026 7:42 AM

– 8లో

మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆదర్శమూర్తి అని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ తెలిపారు.

భక్తిశ్రద్ధలతో

సంకటహర చతుర్ది

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఆదివారం సంకటహర గణ పతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి–బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తదుపరి ఉత్సవమూర్తులను ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 9 నుంచి 10 వరకు, 11 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్ది గణపతి వ్రతాన్ని భక్తులతో జరిపించారు.

స్వర్ణ రథంపై స్వామివారు

స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యే క అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి స్వర్ణరథంలో కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు పట్టా రు. కార్యక్రమంలో ఈవో పెంచలకిషోర్‌, ఏఈవో రవీంద్రబాబు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

నేడు జీడీ నెల్లూరులో పీజీఆర్‌ఎస్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : జీడీ నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ వెల్లడించారు. ఉదయం 9.30 గంటలకు పీజీఆర్‌ఎస్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు కచ్చితంగా హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement