కీ చూసి దిద్దేయండి....అడ్జెస్ట్ అవ్వండి
పాఠం రాకపోయినా పర్వాలేదు..
పేపర్ దిద్దేస్తే చాలు
బోధన అనుభవం లేని వారితో మూల్యాంకనమా...?
ట్యాబ్ ఉంటే చాలు.. టాలెంట్ అక్కర్లేదా?
నేటి నుంచి టెన్త్ మూల్యాంకనం ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ (స్పాట్ వాల్యుయేషన్) ప్రారంభం కానుంది. విద్యాశాఖ అధికారులు చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. మూల్యాంకన ప్రక్రియలో లోలోపల జరుగుతున్న తప్పిదాలు చూస్తుంటే విద్యార్థుల భవిష్యత్ అంధకారమయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా టీచర్ల నియామకాల్లో ఆటోమేషన్ పేరుతో చేసిన ప్రయోగాలు విద్యావ్యవస్థను నవ్వులపాలు చేస్తున్నాయి.
బోధించని వారితో దిద్దించడమేంటి
నిబంధనల ప్రకారం పదో తరగతి విద్యార్థులకు ఆయా సబ్జెక్టులను కనీసం మూడేళ్లు బోధించిన అనుభవం ఉన్న టీచర్లనే మూల్యాంకనం విధుల్లో నియ మించాలి. ఈ సారి అధికారులు ఆ నిబంధనలను తుంగలో తొక్కారు.
పదో తరగతే లేని
స్కూళ్ల నుంచి నియామకాలు
గత ఏడాది 9వ తరగతి ప్రారంభమై, 2026–27 విద్యా సంవత్సరంలో మొదటిసారి పదో తరగతి బ్యాచ్‌ను సిద్ధం చేయబోతున్న అప్‌గ్రేడ్ హైస్కూల్ టీచర్లకు సైతం స్పాట్ ఆర్డర్లు ఇచ్చారు. వీరికి పదో తరగతి సిలబస్ పైన, ప్రశ్నల సరళిపైన కనీస అవగాహన లేకపోవడం గమనార్హం.
కీ చూసి అడ్జెస్ట్ దిద్దాలంట..!
తమకు 10వ తరగతి బోధించిన అనుభవం లేదని, పేపర్లు దిద్దడం కష్టమని మొరపెట్టుకుంటున్న టీచర్ల కు అధికారుల నుంచి వింత సమాధానాలు ఎదురవుతున్నాయి. ప్రిన్సిపల్ ఆఫ్ వ్యాల్యుయేషన్ (కీ) ఇస్తాం.. దాన్ని చూసి దిద్దేయండి అంటూ సలహాలు ఇస్తున్నారు. ఒక పేపర్‌ను చూసి విద్యార్థి రాసిన విశ్లేషణాత్మక సమాధానాలను అంచనా వేయడం సాధ్యమేనా? ఈ ప్రక్రియలో జరిగే చిన్న పొరపాటైనా విద్యార్థి గ్రే డింగ్‌ను మార్చేసి వారి ఉన్నత చదువుల అవకాశాల ను దెబ్బతీస్తుంది. ఈ కనీస స్పృహ అధికారుల్లో లేక పోవడం దారుణమని విద్యావేత్తలు వాపోతున్నారు.
సాంకేతికత పేరుతో అట్టహాసం
ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు, నో మొబైల్ జోన్, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయడం మంచిదేనని, సబ్జెక్ట్‌పై పట్టు లేనివారు పేపర్లను ఎలా దిద్దుతారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. విధులకు హాజరుకాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని టీచర్లను బెదిరిస్తున్న విద్యాశాఖ అధికారులు అర్హత లేని వారితో మూల్యాంకనం చేయించి విద్యార్థులకు అన్యాయం చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా రు. ఈ అస్తవ్యస్త విధానంపై ఉపాధ్యాయ సంఘా లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు వాస్తవ పరిస్థితులను గమనించి, తక్షణమే అర్హత లేని టీచర్ల నియామకాలను రద్దు చేసి, అనుభవజ్ణులైన వారితోనే మూల్యాంకనం జరిపించాలని కోరుతున్నారు.
మూల్యాంకనం కోసం చేసిన ఏర్పాట్లు
పదో తరగతి మూల్యాంకనం నిర్వహించే పీసీఆర్ ప్రభుత్వ పాఠశాల
హోరెత్తిన మాన్సూన్ ఛాలెంజ్ 1
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు నగరంలో ఆరోగ్య చైత న్యం వెల్లివిరిసింది. మిట్టూరులోని అరుణాచలం కళాశాల ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మాన్సూన్ ఛాలెంజ్–1 సైక్లింగ్ కార్యక్రమం ఆదివారం అశేష జనవాహిని మధ్య ఘనంగా ముగిసింది. ఇందులో వందలాది మంది సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొని ఫిట్‌నెస్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ సీఐ నిత్యబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యమన్నారు. నేటి యాంత్రిక జీవనంలో సైక్లింగ్ అనేది అత్యవసరమన్నారు. దీనివల్ల శరీరంలోని కండరాలను దృఢంగా మారడమే కాకుండా మానసిక ఒత్తిడి దూరమవుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భా గం చేసుకోవాలని చెప్పారు. అరుణాచలం కళాశాల చైర్మన్ జగన్నాథరెడ్డి మాట్లాడుతూ తాను స్వయంగా సైక్లింగ్ చేయడం వల్ల బరువు తగ్గి, ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులకు చదు వుతో పాటు శారీరక ధృఢత్వం ముఖ్యమన్నారు. విజయం కళాశా ల ప్రిన్సిపాల్ జయంత్, సైక్లిస్ట్ డాక్టర్ భరత్‌రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్, స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలన్నారు. అనంతరం సైక్లింగ్ ఫోటీల్లో గెలుపొందిన వారికి మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సైకిలిస్ట్‌లు సురేంద్రరెడ్డి, ఏలు మలై, వాసు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థికీ పదో తరగతి కీలకం. ఇందులో వచ్చే మార్కులే ఉన్నత విద్యకు మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఈ క్రమంలో ఎంతో జాగ్రత్తగా మూల్యాంకనాన్ని చేయించాల్సిన రాష్ట్ర విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. సాంకేతికత పేరుతో ఆటోమేషన్ అంటూ అట్టహాసం చేస్తూ, క్షేత్రస్థాయిలో కనీస నిబంధనలను గాలికొదిలేసింది. పదో తరగతి పాఠాలు చెప్పని వారికి, అసలు హైస్కూల్ ముఖమే చూడని టీచర్లకు స్పాట్ విధులను కేటాయించింది. సీసీ కెమెరాల నిఘా, ట్యాబ్ ఆధారిత నమోదు, నో మొబైల్ జోన్ అంటూ ఆర్భాటం చేస్తూ సబ్జెక్టుపై అవగాహన లేని వారితో పేపర్లు దిద్దించడానికి చర్యలు తీసుకుంది. దీంతో పిల్లల భవితవ్యం ఏమవుతోందనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
పాఠశాలలు ఖాళీ.. విధుల్లో గందరగోళం
ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు సోమవా రం నుంచి సమ్మేటివ్–2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలోనే అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను స్పెషల్ అసిస్టెంట్లుగా మూ ల్యాంకనం విధులకు పిలిచారు. కొన్ని పాఠశాలల్లో ఐదుగురు టీచర్లు ఉంటే నలుగురిని స్పాట్ విధులకు కేటాయించారు. ఒక్క టీచర్‌తో పాఠశాల ఎలా నడుస్తుందని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నా రు. మరికొన్ని హైస్కూళ్లలో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు ఉన్నా, టీచర్లందరినీ నియమించడంతో అవి మూతపడే పరిస్థితి నెలకొంది. గణాంకా ల కోసం, ప్రక్రియను త్వరగా ముగించడం కోసం విద్యాశాఖ అనుసరిస్తున్న ఈ అస్తవ్యస్త విధానం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమేనని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి అర్హులైన వారికే ఈ కీలక బాధ్యతలు అప్పగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
టెన్త్ మూల్యాంకనంలో విద్యాశాఖ అస్తవ్యస్థ నిర్ణయాలు


