నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ | - | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

Apr 6 2026 7:42 AM | Updated on Apr 6 2026 7:42 AM

చిత్తూరు కార్పొరేషన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉద యం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

తప్పులు జరిగితే వేటే

చిత్తూరు కలెక్టరేట్‌ : మూల్యాంకన ప్రక్రియలో తప్పులు జరిగితే వేటు ఖాయమని డీఈవో రాజేంద్రప్రసాద్‌ హెచ్చరించారు. ఆయన ఆదివారం పీసీఆర్‌ పాఠశాలలో ఏసీవోలతో మూల్యాంకన ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ఎలాంటి తేడాలు జరగకుండా మూల్యాంకన విధులు నిర్వర్తించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్‌ వినియోగించకూడదన్నారు. మూల్యాంకన కేంద్రంలోకి బయటి వ్యక్తులను అనుమతించేది లేదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐడీ కార్డు ధరించాలన్నారు. సీసీ కెమెరాల నిఘాలో మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు. వైట్‌నర్‌ కనబడకూడదన్నారు. విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కుల నమోదులో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయ ని తెలిపారు. సమావేశంలో డీవైఈవో ఇందిరా, పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ జయప్రకాష్‌నాయుడు, ఎంఈవోలు రమేష్‌, అరుణాచలరెడ్డి, హసన్‌బాషా, పాండ్యన్‌, హెచ్‌ఎంలు సురేష్‌, అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

నేటి నుంచి సమ్మేటివ్‌–2

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలోని అన్ని యాజమాన్యా ల పాఠశాలల విద్యార్థులకు సోమవారం నుంచి సమ్మేటివ్‌–2(వార్షిక) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు జిల్లా విద్యాశా ఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ ప్రకారం 1 నుంచి 5వ తరగతుల విద్యార్థులకు 6, 7, 8, 9 తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, 6 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు 6, 7, 8, 9, 10, 11, 13 తేదీల్లో ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలను జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం అధికారులు పర్యవేక్షించనున్నారు.

నేడు ప్రజాఫిర్యాదుల కార్యక్రమం

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నగరంలోని వన్‌టౌన్‌ పక్కన్న ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎస్పీ తుషార్‌ డూడి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి ప్రజలు ఫిర్యాదులు అందజేయవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement