పూతలపట్టు మండలంలో పచ్చకుట్రలు తారాస్థాయికి చేరాయి. వైఎస్సార్‌సీపీకి జనం నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక అన్ని పథకాల ప్రయోజనాలు పొందుతున్నా ప్రభుత్వంపై బురదజల్లడమే ప్రణాళికగా పచ్చనేతలు కుట్రలు పన్నుతున్నారు. సామాన్య ప్రజలపై దాదాగిరి చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ దళిత ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వస్తే గ్రామంలో ఉండకూడదని హుకుం జారీ చేస్తున్నారు. టీడీపీ రౌడీయిజం చేసే చోట మాత్రమే ఈ తతంగం నడుస్తోంది. ప్రజలను భయపెట్టి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని పచ్చనేతలు చేస్తున్న కుట్రలపై గ్రామీణ సామాన్య జనం మండిపడుతోంది.