
మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
కార్వేటినగరం: రానున్న సారస్వత ఎన్నికల్లో సురులు, అసురుల మధ్యే పోటీ ఉంటుందని అందులో గెలిచిదే దేవతలు లాంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులేనని ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. శుక్రవారం కొటార్వేడులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు అధికార దాహాన్ని తీర్చేందుకు ఎల్లో మీడియా ఆరాటపడుతోందని ఆరోపించారు. ఎస్సీ గా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అన్నప్పుడే నిజమైన ఎస్సీ తెలుగు దేశం శ్రేణులు తమ పదవులకు రాజీనామా చేసి ఉండాలని, అప్పుడే అంబేడ్కర్ ఆత్మ శాంతించి ఉంటుందని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టి రాష్ట్ర ప్రజల ను మోసం చేసేందుకు చూస్తున్నారని, బాబు మ్యానిఫెస్టో ఓ అబద్దాల పుట్టని, ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. రాక్షస మనస్తత్వం కలిగిన చంద్రబాబు మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి రావడమే కాకుండా వారి కుటుంబసభ్యులను మభ్యపెట్టి తన వైపు తిప్పు కుని ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా చేసిన రావణాసురుడని ఆరోపించారు. జగనన్నను దెబ్బతీయాలని కోటేశ్వర్లంతా ఒక్కటై చంద్రబాబు పక్షాన ఉన్నా రని పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ప్రతి ఒక్కరూ పేదవారేనని, ఒకప్పుడు చంద్రబాబు తండ్రి ఖర్జూరపునాయుడు కూడా పేదవాడేనని, ఈ విషయం మరచి చంద్రబాబు పేదలను హీనంగా చూస్తూ, ధనికుల పక్షాన నిలుస్తున్నారని విమర్శించారు. ‘నావల్ల మీ కుటుంబాలు ఆర్థికంగా బాగుపడి ఉంటే, మీ పిల్లలు చదువుకుని బాగుపడి ఉంటే, నేను చేసే పనులు నచ్చి ఉంటేనే నాకు ఓట్లు వేయండి’ అని చెప్పిన ఏకై క ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనని అభివర్ణించారు. నేడోరేపో స్కిల్ స్కామ్‌లో బాబుకు శిక్ష తప్పదని, అదే విధంగా మార్గదర్శిలో రామోజీకి కూడా అదే పరిస్థితి అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్న ఒక్కరే అభ్యర్థి అని, ఆయన గాలిలో అభ్యర్థ్థులందరూ గెలుస్తారని, సంక్షేమ పథకాలే గెలుపునకు దోహదపడుతాయని నారాయణస్వామి తెలిపారు.
చంద్రబాబు మ్యానిఫిస్టో ఓ అబద్దాల పుట్ట
2024 ఎన్నికల్లో జగనన్న ఒక్కరే అభ్యర్థి
డిప్యూటీ సీఎం నారాయణస్వామి