Yahoo News: 20 ఏళ్ల సేవలకు ముగింపు.. మరి యాహూ మెయిల్స్‌ సంగతి?

Yahoo Shuts Down Yahoo News Operations In India - Sakshi

Yahoo News India: వెబ్‌ సర్వీసుల ప్రొవైడర్‌ యాహూ.. భారత్‌లో న్యూస్‌ ఆపరేషన్స్‌ను నిలిపివేసింది. 20 ఏళ్ల సేవలకు నేటితో(ఆగష్టు 26) పుల్‌స్టాప్‌ పెట్టింది. ఈ మేరకు న్యూస్‌ ఆధారిత వెబ్‌సైట్ల కార్యకలాపాలను నిలిపివేసినట్లు  అధికారికంగా ప్రకటించిన యాహూ..  మెయిల్‌ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. 

అమెరికాకు చెందిన వెబ్‌ సేవల కంపెనీ యాహూ.. ఇవాళ్టి నుంచి వార్తా సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. గురువారం నుంచి ఎలాంటి కొత్త కంటెంట్‌ను పబ్లిష్‌ చేయకపోవడం విశేషం. అయితే ఈ షట్‌డౌన్‌తో మిగతా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఆగష్టు 26 నుంచి యాహూ ఇండియా.. ఎలాంటి కంటెంట్‌ను పబ్లిష్‌ చేయబోదు. యాహూ అకౌంట్‌తో పాటు మెయిల్‌, సెర్చ్‌ అనుభవాలపై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదు. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేద’’ని యాహూ ఇండియా హోం పేజీలో ప్రకటించింది. క్లిక్‌ చేయండి: వాట్సాప్‌ వాయిస్‌ కాల్‌ రికార్డు.. ఇలా చేయొచ్చు

ఇక ఈ ప్రకటనతో యాహూ న్యూస్‌, యాహూ క్రికెట్‌, ఫైనాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, మేకర్స్‌కు సంబంధించిన కంటెంట్‌ నిలిచిపోనుంది. ఎఫ్‌డీఐ కొత్త రూల్స్‌..  విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్‌ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను.. అదీ కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే కొత్త చట్టాలు అనుమతించనున్నాయి. అక్టోబర్‌ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానుంది. 

డిజిటల్‌ కంటెంట్‌.. ముఖ్యంగా యాహూ క్రికెట్‌పై ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.  గత 20 ఏళ్లుగా యాహూ సేవలు ప్రీమియం, లోకల్‌ కంటెంట్‌ అందిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్‌కి పర్యాయపదంగా యాహూను.. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్‌ 2017లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

చదవండి: ముట్టుకోకుండానే ఫోన్‌ పని చేస్తుందిక

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top