షియోమీ కొత్త లోగోపై నెటిజన్ల ట్రోల్స్

Xiaomi Has A New Logo, And People Are Trolling It Online - Sakshi

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన కొత్త లోగోను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ఈ లోగో తయారీ కోసం 3 లక్షల డాలర్లు(సుమారు రూ.2.2 కోట్లు) ఖర్చు, నాలుగు సంవత్సరాల కాలం పట్టినట్లు షియోమీ పేర్కొంది. ఇప్పుడు మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు, అసలు లోగోకు కొత్త లోగోకు మధ్య తేడా ఏమి లేదు అనే కదా. షియోమీ దీనిని 'అలైవ్' డిజైన్ కాన్సెప్ట్‌తో ప్రపంచ ప్రముఖ డిజైనర్, జపాన్‌లోని ముసాషినో ఆర్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్యా హరా డిజైన్ చేశారు. ఇందులో ఉన్న ఆరెంజ్ రంగు షియోమీ యూత్‌ఫుల్‌నెస్‌కు ప్రతీక అని కంపెనీ తెలిపింది. ఇందులో ఉన్న వైట్ రంగు విలువైన హైఎండ్ ఉత్పత్తులను అందిస్తూనే ఉంటామనే సందేశాన్ని తెలుపుతున్నట్లు షియోమీ ప్రకటనలో పేర్కొంది.

లోగోను చతురస్రాకారం నుంచి వృత్త చతురస్రాకారంలోకి మార్చడంతో పాటు తమ కంపెనీ అంతర్గత స్పిరిట్‌ను, బ్రాండ్ స్వభావాన్ని కూడా మార్చామని తెలిపారు. దీంతోపాటు కొన్ని గణిత శాస్త్రానికి సంబందించిన సిద్ధాంతాల ఆధారంగా ఈ కొత్త లోగోను తయారు చేయడానికి ఇంత సమయం పట్టిందని కంపెనీ సీఈవో పేర్కొన్నారు. అయితే, షియోమీ కొత్త లోగోపై ఆన్ లైన్‌లో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అసలు ఇందులో కొత్తదనం ఏముంది అని, దానికింత ఖర్చయిందని ట్రోల్ చేస్తున్నారు. రూ.10 ఖర్చుపెడితే 10 నిమిషాల్లోనే మార్చవచ్చని దీనికి 2.2 కోట్లు అవసరమా? అని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.

చదవండి:

సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక

ఇండోనేషియాలో భారీ వరదలు.. 44మంది మృతి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top