
సాక్షి, సిటీబ్యూరో: నిర్మాణ రంగంలో త్రీడీ ప్రింటింగ్ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుంది. హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ సంస్థ రిధిర గ్రూప్ త్రీడీ ముద్రణ సాంకేతికతను వినియోగించింది. ప్రపంచంలోనే తొలిసారిగా కమ్యూనిటీ లివింగ్ ‘రిధిర జెన్’ రిసార్ట్‌ను త్రీడీలో ముద్రించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
రీసైకిల్ చేసిన, స్థానిక వనరులతో అవసరమైన మెటీరియల్స్ మాత్రమే త్రీడీలో ముద్రించే వీలు కలుగుతుందని, దీంతో వ్యర్థాల విడుదల గణనీయంగా తగ్గుతుందని సంస్థ ఎండీ రితేష్ మస్తిపురం తెలిపారు. భారీ యంత్రాలు, కార్మికుల వినియోగంతో పాటు కర్బన ఉద్ఘారాల విడుదల 50 శాతం వరకు తగ్గుతుందని పేర్కొన్నారు.