
సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు నిర్వహణ
‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2025’ సదస్సు సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు ఢిల్లీలో జరగనుంది. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. ఈ రంగంలో పెట్టుబడుల అవకాశాలను అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు పరిచయడం చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్‌లో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సదస్సును ‘భారత్ మండపం’లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక పోర్టల్, మొబైల్ అప్లికేషన్‌ను మంత్రి ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,410 కోట్లు
గతంలో నిర్వహించిన మూడు ఎడిషన్లు (సదస్సులు) విజయవంతమైనట్టు, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ కార్యదర్శి అవినాష్ జోషి తెలిపారు. గత దశాబ్ద కాలంలో ఈ రంగం ఎంతో పురోగతి సాధించినట్టు చెప్పారు. దేశ వ్యవసాయ ఎగుమతుల్లో ఈ విభాగం నుంచే 20 శాతం ఉంటున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎక్విప్‌మెంట్ తయారీదారులు, ప్యాకేజింగ్ సొల్యూషన్ కంపెనీలు, లాజిస్టిక్స్ సంస్థలు, స్టార్టప్‌లు పాల్గొనున్నట్టు తెలిపారు.