రూ. 15వేలు జీతంలో ఆనందం.. రూ. 2.5లక్షల్లో అసంతృప్తి! | Woman Earning Rs 2 5 Lakh Says She Was Happiest At Rs 15000 | Sakshi
Sakshi News home page

రూ. 15వేలు జీతంలో ఆనందం.. రూ. 2.5లక్షల్లో అసంతృప్తి!

Mar 22 2026 6:19 PM | Updated on Mar 22 2026 6:26 PM

Woman Earning Rs 2 5 Lakh Says She Was Happiest At Rs 15000

జీతం ఎక్కువ వచ్చే జాబ్ చేస్తే.. సంతోషంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అది ఏ మాత్రం నిజం కాదంటూ, వచ్చే జీతానికి సంతోషానికి సంబంధం ఉండదని ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

''నాకు నిజంగా ఆనందం కలిగింది.. నెలకు 15,000 రూపాయల జీతం పొందిన సమయంలోనే. కానీ ఇప్పుడు నెలకు 2.5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ, సంతృప్తి తగ్గిపోయింది'' అని ఎక్స్ యూజర్ సాక్షి వెల్లడించారు. ఇది డబ్బు ఎక్కువ కావడం వల్ల కాదు, ఇతరుల జీవన స్థితులతో తనను పోల్చుకోవడం వల్ల ఏర్పడిన అసంతృప్తి అని ఆమె పేర్కొన్నారు.

ఉద్యోగం వదిలిన తర్వాత కొన్ని నెలలు జీతం లేకపోవడం వల్ల ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నా, అది నిజాన్ని గ్రహింపజేసింది. నిజమైన సంతోషం అంటే ఎక్కువ జీతం పొందడంలో కాదు, మనం నిజంగా ఇష్టపడే పని చేయడంలో ఉందని. ఇప్పుడు నేను ఇతరుల గురించి ఆలోచించకుండా పనిచేస్తాను. ఆమె అభిప్రాయం ప్రకారం, “పెద్ద జీతం లేదా తక్కువ జీతం కాదు, జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నావో అనేది ముఖ్యం.

Advertisement
 
Advertisement
Advertisement