అలర్ట్‌..మార్చి 31 డెడ్‌లైన్‌...! ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదు..!

WhatsApp Will Stop Working On These Phones From March 31: All Details - Sakshi

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్‌. 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్‌ సొంతం. యూజర్లకు అద్బుతమైన ఫీచర్స్‌ను అందుబాటలోకి తెచ్చేందుకు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను వాట్సాప్‌ ఇస్తుంది. ఈ అప్‌డేట్స్‌ కేవలం సదరు ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ అపరేటింగ్‌ సిస్టమ్స్‌కు మాత్రమే మద్దతు ఇస్తాయి. పాత ఆపరేటింగ్‌ సిస్టం కల్గిన స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌ సేవలు పనిచేయవు.

తాజాగా మార్చి 31 (గురువారం) నుంచి పలు స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదని సమాచారం. పాత  Android, iOS, KaiOS వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ను కల్గిన వాటిలో వాట్సాప్‌ సేవలు నిలిపివేయబడతాయి.  వాట్సాప్‌ పనిచేయని స్మార్ట్‌ఫోన్ల జాబితాలో షావోమీ, శాంసంగ్‌, ఎల్‌జీ, మోటరోలా కంపెనీ స్మార్ట్‌ఫోన్స్‌ ఉన్నాయి. 

మార్చి 31 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు
ఆండ్రాయిడ్ ఫోన్‌లు : మీ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 4.1 వెర్షన్ లేదా అంతకంటే కొత్త వెర్షన్ లేకపోతే, వాట్సాప్ పని చేయడం ఆగిపోతుంది. 

iOS ఫోన్‌లు : iOS 10 లేదా ఆ తర్వాత వెర్షన్‌లో ఉన్న iPhone వినియోగదారులు మాత్రమే తమ పరికరంలో వాట్సాప్‌ను ఉపయోగించగలరు. అంతకంటే తక్కువ వెర్షన్‌ ఉన్న యాపిల్‌ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదు. 

KaiOS : మీ స్మార్ట్‌ఫోన్‌  KaiOS ప్లాట్‌ఫాంతో పనిచేస్తే... KaiOS వెర్షన్ 2.5 లేదా అంతకంటే కొత్త వెర్షన్‌ ఉంటేనే వాట్సాప్‌ పనిచేస్తోంది. 

వాట్సాప్‌ సపోర్ట్‌ చేయని స్మార్ట్‌ఫోన్ల జాబితా ఇదే..!

ఎల్‌జీ
LG Optimus F7, Optimus L3 II Dual, Optimus F5, Optimus L5 II, Optimus L5 II Dual, Optimus L3 II, Optimus L7 II Dual, Optimus L7 II, Optimus F6, LG Enact, Optimus L4 II Dual, Optimus F3, Optimus L4 II , Optimus L2 II, Optimus F3Q

మోటరోలా
Motorola Droid Razr

షావోమీ
Xiaomi HongMi, Mi2a, Mi2s, Redmi Note 4G , HongMi 1s

హువావే
Huawei Ascend D, Quad XL, Ascend D1, Quad XL , Ascend P1 S

శాంసంగ్‌
Samsung Galaxy Trend Lite, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core

చదవండి: భయపెట్టిన 3 అంకెలు..! ఎట్టకేలకు సెంచరీ కొట్టిన గూగుల్‌ క్రోమ్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top