
ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ బీఎల్‌డీసీ టెక్నాలజీతో నడిచే వీ-గార్డ్ కొత్త ఎయిర్ విజ్ సిరీస్ సీలింగ్ ఫ్యాన్లను ఆవిష్కరించినట్లు తెలిపింది. వీటిలో స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. హైస్పీడ్ ఎయిర్ ఫ్లోతో కేవలం 35 వాట్ల విద్యుత్ వినియోగంతో ఇవి పనిచేస్తాయని చెప్పింది. 4/8 గంటల ఆటో-ఆఫ్ టైమర్‌తో రిమోట్ ఆపరేట్ సదుపాయం ఉందని పేర్కొంది.
ఎయిర్ విజ్ సిరీస్‌లో భాగంగా విభిన్న వేరియంట్లను పరిచయం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎయిర్‌విజ్ లైట్, ఎయిర్‌విజ్ ప్రైమ్, ఎయిర్‌విజ్ ప్లస్, ఎయిర్‌విజ్ ఎన్‌లను ఆవిష్కరించింది. వేరియంట్‌ను అనుసరించి ప్రత్యేక ఫీచర్లు ఉన్నట్లు చెప్పింది. వీటిని వీ-గార్డ్స్ రూర్కీ ఫెసిలిటీలో రూపొందిస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: రూ.19,500 విలువైన సబ్‌స్క్రిప్షన్ ఉచితం!
ఈ సందర్భంగా వీ-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మిథున్ చిట్టిలపల్లి మాట్లాడుతూ..‘ఎయిర్ విజ్ బీఎల్‌డీసీ(బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్-ఏసీ మోటార్లను ఉపయోగించే సంప్రదాయ ఫ్యాన్‌ల మాదిరిగా కాకుండా, బీఎల్‌డీసీ ఫ్యాన్‌లు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ద్వారా నియంత్రించబడే శాశ్వత మాగ్నెట్ మోటార్‌ను ఉపయోగిస్తాయి) ఫ్యాన్‌ను ఆవిష్కరించడం సంస్థ ప్రయాణంలో కీలక మైలురాయిని సూచిస్తుంది. వృద్ధి, ఇన్నోవేషన్‌పరంగా ఫ్యాన్ కేటగిరీ మా వ్యాపారానికి చాలా ముఖ్యం. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా బీఎల్‌డీసీ సాంకేతికత చాలా అవసరం’ అన్నారు.