యూపీఐ లావాదేవీలు @ రూ. 314 లక్షల కోట్లు | UPI clocks RS 314 lakh crore transactions in FY26 | Sakshi
Sakshi News home page

యూపీఐ లావాదేవీలు @ రూ. 314 లక్షల కోట్లు

May 1 2026 3:50 AM | Updated on May 1 2026 7:49 AM

UPI clocks RS 314 lakh crore transactions in FY26

గత ఆర్థిక సంవత్సరంలో నమోదు 

పదేళ్లలో 4,000 రెట్ల వృద్ధి 

న్యూఢిల్లీ: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలు గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో రికార్డు స్థాయికి చేరాయి. రూ. 314 లక్షల కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2016–17లో కేవలం రూ. 0.07 లక్షల కోట్లుగా ఉన్న ఈ విలువ, పదేళ్లలో 4,000 రెట్లు పెరగడం విశేషం. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.  
    
→ 2016–17లో 2 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా.. 2025–26లో 24,162 కోట్లకు పెరిగాయి.  
→ 2025 ఆగస్టులో తొలిసారిగా నెలవారీ లావాదేవీలు 2,000 కోట్ల సంఖ్యను దాటాయి. 2025 డిసెంబర్‌లో గరిష్టంగా 2,163 కోట్ల లావాదేవీలు జరిగాయి. 
→ 2025 క్యాలెండర్‌ ఇయర్‌లో రోజుకు సగటున 60 కోట్ల లావాదేవీలు నమోదవగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 66 కోట్లు దాటింది. 
→ ప్రారంభంలో యూపీఐ నెట్‌వర్క్‌ పరిధిలో 44 బ్యాంకులు మాత్రమే ఉండగా, 2025–26 నాటికి ఆ సంఖ్య 703 బ్యాంకులకు చేరింది. 
→ ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్‌ టైమ్‌ చెల్లింపుల్లో 49 శాతం వాటా యూపీఐదేనని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) సైతం తన 2025 నివేదికలో పేర్కొనడం గమనార్హం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement