Union Budget 2023: సీతారామన్‌ ‘సప్తఋషులు’.. అవేంటంటే!

Union Budget 2023 FM Nirmala Sitharaman highlights seven priorities - Sakshi

న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెడుతున్నారు. ఈ బ‌డ్జెట్‌లో ఏడు అంశాల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నట్టు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అమృత కాల్ బడ్జెట్‌లో అవి ఒకదానికొకటి సమన్వయంతో సప్త ఋషులుగా  మార్గ నిర్దేశనం చేస్తాయని చెప్పారు. ఈ ప్రాధాన్యతలు దేశాన్ని 'అమృత్ కాల్' వైపు మళ్లిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఇవి తమ ప్రభుత్వానికి ఫ్రేమ్‌వర్క్‌గా సీతారామన్‌ అభివర్ణించారు.

సీతారామన్   ఏడు ప్రాధాన్యతలు:
సమ్మిళిత అభివృద్ధి
రీచింగ్‌ లాస్ట్‌
మౌలిక సదుపాయాలు ,పెట్టుబడి
పొటెన్షియల్‌  గ్రోత్‌ 
గ్రీన్ గ్రోత్
యువశక్తి
ఆర్థిక  విభాగం

అలాగే పీవీటీజీ గిరిజనుల కోసం ప్రత్యేక పథకాన్ని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు పరిశుధ్దమైన నీరు, ఇండ్లు, రోడ్‌,టెలికాం వసతుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు.  ఇందుకోసం   15 వేల కోట్లు కేటాయించారు. ఈ  మిషన్‌, వచ్చే మూడేళ్లలో వారి సంకక్షేమం కోసం  కృషి చేయనున్నట్టు ఆర్థిక మంతత్రి పార్లమెంటులో వెల్లడించారు. అలాగే ఏకలవ్య మోడల్‌ స్కూళ్లను ప్రకటించారు. ఇందుకోసం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపడుతున్నట్టు ప్రకటించారు.   

మ‌హిళ‌లు, రైతుల‌, యువ‌త‌, వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నట్టు అందుకోసం ప్రత్యక అవకాశాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత ప్రోత్సహించేలా సంస్క‌ర‌ణ‌లు చేపడుతున్నట్టు ప్రకటించారు. వ్యవసాయానికి పెద్దపీటవేయడంతోపాటు, యువ రైతులను ప్రోత్సహించేందుకు అగ్రి స్టార్టప్ లకు ప్రత్యేక నిధి  ఏర్పాటును ప్రకటించారు.  వ్య‌వ‌సాయ రంగంలో స‌వాళ్ల‌ను ఎదుర్కొనేలా  ప్ర‌ణాళిక‌ అని  చెప్పారు.  63 వేల వ్య‌వ‌సాయ ప‌ర‌ప‌తి సంఘాల డిజిట‌లైజేష‌న్‌ చేస్తామని, ఇందుకోసం  రూ. 2 వేల కోట్లు కేటాయింపును ప్రకటించారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top