కళ్లకు గంతలు కాదు.. హైటెక్‌ మసాజర్‌

truerel eye massager works on bluetooth - Sakshi

ఫొటోలో కనిపిస్తున్న యువతి కళ్లకు తెల్లని గంతలు తొడుక్కున్నట్లు కనిపిస్తోంది కదూ! ఆమె కళ్లకు తొడుకున్నది గంతలు కాదు, హైటెక్‌ మసాజర్‌. అమెరికన్‌ కంపెనీ ‘ట్రూరెల్‌’ రూపొందించిన ‘ఐ మసాజర్‌’. ఇది బ్లూటూత్‌ ద్వారా పనిచేస్తుంది. అలసిన కళ్లను సుతారంగా మర్దన చేస్తుంది. కళ్ల చుట్టూ తగినంత నులివెచ్చదనాన్ని కలిగిస్తుంది.

(Radhika Merchant Bag: అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. అందరి దృష్టి దానిపైనే.. ధర ఎంతో తెలుసా?)

ఇందులోని ఎస్టీవీ టెక్నాలజీ ద్వారా కోరుకున్న రీతిలో వైబ్రేషన్స్, పల్సింగ్‌ సృష్టించి, తగినంత వెచ్చదనాన్ని, గాలి పీడనాన్ని కలిగించి కళ్ల అలసటను ఇట్టే మటుమాయం చేస్తుంది. ఇది అడ్జస్టబుల్‌ హెడ్‌సెట్‌తో లభిస్తుంది. తల పరిమాణానికి తగినట్లుగా దీన్ని అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. ఇందులోని ప్లేలిస్ట్‌లో ఉన్న పాటలను వింటూ, కళ్లకు మర్దన తీసుకుంటూ, హాయిగా సేదదీరవచ్చు. దీని ధర 105 డాలర్లు (రూ.8,678) మాత్రమే.

(వెంట వచ్చే రిఫ్రిజిరేటర్‌.. మొబైల్‌ ఫోన్‌లోనే కంట్రోలింగ్‌)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top