వెంట వచ్చే రిఫ్రిజిరేటర్‌.. మొబైల్‌ ఫోన్‌లోనే కంట్రోలింగ్‌ | Sakshi
Sakshi News home page

వెంట వచ్చే రిఫ్రిజిరేటర్‌.. మొబైల్‌ ఫోన్‌లోనే కంట్రోలింగ్‌

Published Sun, Apr 2 2023 8:07 AM

Ankers portable fridge - Sakshi

సాధారణ రిఫ్రిజిరేటర్‌ను ఇంట్లో వాడుకోగలం గాని, బయటకు తీసుకుపోలేం. నడివేసవిలో దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు రిఫ్రిజిరేటర్‌ ఉంటే బాగుండనపిస్తుంది. పోర్టబుల్‌ కూల్‌డ్రింక్‌ చిల్లర్స్‌ వంటివి ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి.

ఇదీ చదవండి: నేను ‘మోనార్క్‌’ని... సెల్ఫ్‌డ్రైవింగ్‌ ట్రాక్టర్‌

తాజాగా పోర్టబుల్‌ మొబైల్‌ రిఫ్రిజిరేటర్‌ను అమెరికన్‌ బహుళజాతి సంస్థ ఏంకర్‌ అందుబాటులోకి తెచ్చింది. ‘ఎవర్‌ఫ్రాస్ట్‌ పవర్డ్‌ కూలర్‌’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ మొబైల్‌ రిఫ్రిజిరేటర్‌ రీచార్జబుల్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది 33 లీటర్లు, 43 లీటర్లు, 53 లీటర్ల పరిమాణాల్లో దొరుకుతుంది.

ఇందులో మంచినీళ్లు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, పండ్లు, కూరగాయలు వంటివి పెట్టుకోవచ్చు. మొబైల్‌ ఫోన్‌లో దీని యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, యాప్‌ ద్వారా ఇందులోని ఉష్ణోగ్రతను కోరుకున్న రీతిలో నియంత్రించుకునే వెసులుబాటు కూడా ఉంది. దీని ప్రారంభ ధర 1464 డాలర్లు (సుమారు రూ.1.21 లక్షలు) మాత్రమే!

Advertisement

తప్పక చదవండి

Advertisement