
ముంబై: డిజిటల్ టెక్స్‌టైల్ ప్రింటర్ల దిగుమతి, పంపిణీదారు ట్రూ కలర్స్ కంపెనీ ఐపీఓకి సిద్ధమైంది. మార్కెట్ నుంచి రూ.128 కోట్లు సమీకరించనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ.181–191గా నిర్ణయించింది. సబ్‌స్క్రిప్షన్ మంగళవారం (సెప్టెంబర్ 23న) ప్రారంభమై... గురువారం ముగిస్తుంది. యాంకర్ ఇన్వె స్టర్లకు సెప్టెంబర్ 22నే బిడ్డింగ్ విండో తెరుచుకోనుంది.
సమీకరించిన నిధుల్లో మూలధన అవసరాలకు రూ.48.90 కోట్లు, రుణ చెల్లింపులకు రూ.40.40 కోట్లు మిగిలిన ధనాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించనుంది. జీవైఆర్ క్యాపిటల్ అడ్వైజర్స్ బుకింగ్ రన్నింగ్ మేనేజర్‌గా, బిగ్‌షేర్ సర్వీసెస్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి. 2021 అక్టోబర్‌లో ఏర్పాటైన ట్రూ కలర్స్ సంస్థ కోనికా మినోల్టా, హోప్‌టెక్, ఐటెన్, పెంగ్డా, స్కైజెట్ వంటి బ్రాండ్ల నుండి డిజిటల్ టెక్స్‌టైల్ ప్రింటర్లను దిగుమతి చేసుకొని పంపిణీ చేస్తోంది.