అదిగో 5జీ..త్వరలో ట్రాయ్‌ కీలక నిర్ణయం! | Sakshi
Sakshi News home page

అదిగో 5జీ..త్వరలో ట్రాయ్‌ కీలక నిర్ణయం!

Published Wed, Mar 30 2022 7:52 AM

Trai Recommendations On 5g Spectrum Pricing - Sakshi

న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్‌ ధర, ఇతర పద్ధతులపై 7–10 రోజుల్లో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) సిఫార్సులు వెల్లడి కానున్నాయి. సూచనలు తుది దశలో ఉన్నాయని ట్రాయ్‌ సెక్రటరీ వి.రఘునందన్‌ తెలిపారు. ఈ విషయాలను నేడో రేపే ట్రాయ్‌ వెల్లడించే అవకాశం ఉందని పరిశ్రమ ఎదురు చూస్తోంది.

విలువ, రిజర్వ్‌ ధర, పరిమాణం, వేలంలో పాల్గొనడానికి  అర్హతలు, ఇతర షరతులతో సహా వివిధ బ్యాండ్స్‌లో స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించిన విధానాల గురించి చర్చించడానికి గత ఏడాది నవంబర్‌ చివరలో వివరణాత్మక సంప్రదింపు పత్రాన్ని ట్రాయ్‌ విడుదల చేసింది.

మార్చి 2021లో జరిగిన చివరి రౌండ్‌ వేలంలో 855.6 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ కోసం రూ.77,800 కోట్లకు పైగా బిడ్స్‌ను గెలుచుకుంది. మొత్తం స్పెక్ట్రమ్‌లో దాదాపు 63 శాతం అమ్ముడుపోలేదు.      

Advertisement
 
Advertisement
 
Advertisement