కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్‌!

Top Broadcasters Raise Tv Channel Rates After 3 Years - Sakshi

దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇదిలా ఉండగా టీవీ లవర్స్‌కి సైతం కొత్త ఏడాదిలో పెద్ద షాక్‌ తగలనుంది.  ప్రముఖ టీవీ బ్రాడ్‌కాస్టర్లు ఛానళ్లకు సంబంధించి అలకార్టే, బౌక్వెట్ రేట్లను పెంచేశాయి. ఈ ధరల పెంపు నిర్ణయం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులోకి రానుంది. దీని కారణంగా, టీవీ రీఛార్జ్‌ కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్యాక్‌ ఖరీదుగా మారనుంది.

3 సంవత్సరాల తర్వాత
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రకారం.. సోనీ పిక్చర్స్, స్టార్‌ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సహా 42 ప్రసారకర్తలు 332 కంటే ఎక్కువ ఛానెల్‌లు ఉన్నాయి. ప్రసారకర్తలు ఈ ఛానెల్‌లను చూడటానికి నెలవారీ రుసుములను నిర్ణయించారు. దీని ధర 10 పైసల నుంచి 19 రూపాయల వరకు ఉంటుంది. టీవీ బ్రాడ్‌కాస్టర్లు 3 సంవత్సరాల తర్వాత ఛానెల్‌ల ధరలను సవరించారు.   

నవంబర్‌ 22న ప్రసార సేవల నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను ట్రాయ్‌ (TRAI) సవరించినందున ఈ ధరల పెంపు జరిగింది. ఆ తర్వాత జీ (ZEE), కల్వర్‌ మాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సోనీ,  సన్‌ టీవీనెట్‌వర్క్‌ తమ రిఫరెన్స్‌ ఇంటర్‌కనెక్ట్‌ ఆఫర్‌లను (RIO) ఫైల్‌ చేశాయి.  ఆర్‌ఓఐ అనగా సర్వీస్‌ ప్రొవైడర్‌ జారీ చేసిన నియమ నిబంధనల పత్రం. ఒక సర్వీస్‌ ప్రొవైడర్‌ మరో నెట్‌వర్క్‌తో ఇంటర్‌కనెక్షన్‌ కోరుకునే నిబంధనలు, షరతులు అందులో ఉంటాయి. మరో వైపు డిస్నీ స్టార్‌ ఇండియా, వయాకామ్‌ 18 వంటి సంస్థలు కూడా త్వరలోనే ఆర్‌ఐఓలను దాఖలు చేసే అవకాశం ఉంది.

ఫిబ్రవరి నుంచి కొత్త ధరలు
నివేదిక ప్రకారం.. టీవీ వీక్షకుల నెలవారీ టీవీ చందా బిల్లు పెరగబోతోంది. ఎందుకంటే, ప్రధాన టెలివిజన్‌ ప్రసారకర్తలు ఛానెల్‌ల బౌక్వెట్‌ రేట్లను పెంచాయి. ఛానెల్‌లను వీక్షించడానికి పెరిగిన కొత్త ధరలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో టీవీ ఛానెల్‌లను చూడటానికి వీక్షకులు ఎక్కువ డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటికే కొన్ని బౌక్వెట్స్‌ ధరలు 10-15% రేట్లు పెంచినట్లు సమాచారం. సోనీ తన రూ. 31 ధర గల బౌక్వెట్‌ని నిలిపివేసి, దాని స్థానంలో రూ. 43 కొత్తదాన్ని తీసుకొచ్చిందని ఓ కేబుల్‌ టీవీ కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వార్తా సంస్థకు తెలిపారు. 

చదవండి: ఇది మరో కేజీఎఫ్‌.. రియల్‌ ఎస్టేట్‌ సంపాదన, భవనం మొత్తం బంగారమే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top