
Today Stock Market: ఈ వారం ప్రారంభం నుంచి మంచి లాభాలను చవి చూసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం నుంచే నష్టాల బాటలో అడుగులు వేస్తున్నాయి. నేడు 9:15 గంటలకు సెన్సెక్స్ 94.65 పాయింట్ల నష్టంతో 67126.48 వద్ద.. నిఫ్టీ 24.50 పాయింట్ల నష్టంతో 19989.50 వద్ద కొనసాగుతున్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జియో ఫైనాన్సియల్, ఐటీసీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) సంస్థలు ఉన్నాయి. నష్టాల బాటపట్టిన కంపెనీల జాబితాలో ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)