వెనుకబడ్డ ఫేస్‌బుక్‌..దూసుకెళ్లిన టిక్‌టాక్‌..!

Tiktok Surpassed Facebook To Become Most Downloaded App Worldwide In 2020 - Sakshi

షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ సరికొత్త రికార్డును నమోదుచేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌గా టిక్‌టాక్‌ నిలిచింది. అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేయబడిన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంగా నిలిచిన ఫేస్‌బుక్‌ను వెనక్కినెట్టింది. 2020 సంవత్సరంలో అత్యధిక యూజర్లు డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌గా టిక్‌టాక్‌ నిలిచినట్లు ప్రముఖ బిజినెస్‌ జర్నల్‌ నిక్కీ ఏషియా వెల్లడించింది. భారత్‌ లాంటి దేశాల్లో నిషేధానికి గురైన కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌గా టిక్‌టాక్‌ నిలవడం గమనార్హం. 

ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ త‌న మార్కెట్‌ను విస్తరించుకుంటూ వెళ్లడంతో ఈ ఘనతను సాధించినట్లుగా నిక్కీ ఏషియా వెల్లడించింది.  2019లో ప్రపంచవ్యాప్తంగా యాప్స్‌ డౌన్‌లోడ్‌లో టిక్‌టాక్‌ నాలుగో స్థానంలో నిలిచింది.  అత్యధిక యూజర్లు డౌన్‌లోడ్‌ చేసిన యాప్స్‌లో  ఫేస్‌బుక్‌ కు చెందిన వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ యాప్‌లు టాప్‌ 10 లో కొనసాగుతున్నాయి. కాగా టిక్‌టాక్‌ను తిరిగి భారత మార్కెట్లలోకి త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టిక్‌టాక్‌ భారత మార్కెట్లలోకి ఎంట్రీ ఇస్తే టిక్‌టాక్‌ యాప్‌ డౌన్‌లోడ్స్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిక్కీ​ ఏషియా పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top