కోవిడ్‌ సంక్షోభం.. ఆర్థికమంత్రి గారు నోట్లు ముద్రిస్తారా?

There is No Chance To Print Currency To Revive Financial Status Said By FM Nirmala - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవడానికి కొత్తగా నోట్లు ముద్రించే ఆలోచన ఏదీ లేదని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తేల్చి చెప్పారు. కోవిడ్‌ సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ త్వరగానే కోలుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

నో సార్‌
పార్లమెంటు సమావేశాల సందర్భంగా ... కోవిడ్‌ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ విపత్తును ఎదుర్కొనేందుకు నోట్లను ముద్రిస్తారా అంటూ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ‘నో సార్‌’ అంటూ ఆర్థిక మంత్రి చట్టసభలో సమాధానం ఇచ్చారు.

గాడిన పడుతోంది
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల జాతీయోత్పత్తి జీడీపీ సుమారు 7.3 శాతం కుదించబడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.  మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయని అందువల్ల ఇప్పుడప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని, ఈ ఏడాది చివరి నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని  ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు రూ,.30 వేల కోట్లతో ఆత్మనిర్బర్‌ భారత్‌ ప్యాకేజీని ప్రకటించామని వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top