టెస్లాకు దెబ్బ.. ఆ మోడల్‌లో లోపాలు ఉన్నాయ్‌, 30వేల కార్లను..

Tesla Company Recalls 30000 Model X Cars Over Issue Of Front Passenger Airbag - Sakshi

ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌కి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా కంపెనీ వినియోగదారుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన 30 వేలకు పైగా వాహనాలను రీకాల్ చేసింది. తమ వాహనాలలోని లోపాలు ఉన్న భాగాలను రిపేర్/రీప్లేస్ చేయడానికే టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది.

         

ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన మోడల్‌ ఎక్స్‌ (Model X) కార్లలో ఎయిర్‌బ్యాగ్‌ అమరికలో లోపాలు ఉన్నాయని కంపెనీ గుర్తించింది. ఈ సమస్య వల్ల కారు ముందు కూర్చునే ప్యాసింజర్లకు ప్రమాద సమయల్లో గాయాలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ మోడల్‌లోని 30 వేల కార్లను రీకాల్‌ చేసింది.
 

ఈ సమస్యను ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పరిష్కరించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలో.. కఠినమైన రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా గుంతలలో ప్రయాణించేటప్పుడు మోడల్ ఎస్‌ (Model S),  మోడల్ ఎక్స్‌ (Model X)  కార్లలో పవర్ స్టీరింగ్ సమస్య ఏర్పడుతోందని, ఆ మోడల్‌లోని 40,000 వాహనాలను కంపెనీ రీకాల్ చేసిన సంగతి తెలిసిందే.  మరో వైపు టెస్లా షేర్లు దాదాపు 3 శాతం క్షీణించి రేండేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. ఇప్పటికే ట్విటర్‌లోని పరిణామాలు మస్క్‌కి తలనొప్పిగా ఉంటే తాజాగా టెస్లా షేర్లు పతనం కావడం దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి.

చదవండి: భారత్‌లో వన్‌ అండ్‌ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top