Tata Motors: టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుందా? ఇదిగో సాక్ష్యం..!

Tata punch ev spied first time details - Sakshi

దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) ఇప్పటికే భారతదేశంలో టాటా పంచ్ మైక్రో SUV విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. అయితే కంపెనీ ఈ చిన్న కారుని త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకురావడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా పంచ్ ఈవీ ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉంది. దీనికి సంబంధించని ఫోటోలు ఇటీవల వెల్లడయ్యాయి. ఇది ఒక ఫ్లాట్‌బెడ్‌పై ఉండటం ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ కారు పూర్తిగా బహిర్గతం కాకుండా మొత్తం కప్పి ఉంచారు. కావున డిజైన్, ఫీచర్స్ వంటివి స్పష్టంగా వెల్లడి కాలేదు.

ఈ లేటెస్ట్ ఈవీ చూడటానికి దాని పెట్రోల్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో రియర్ డిస్క్ బ్రేక్‌లు ప్రత్యేకించి ఒక భిన్నమైన ఫీచర్. ఇందులో ఛార్జింగ్ స్లాట్ స్పష్టంగా కనిపించడం లేదు, కానీ ఇతర మోడల్స్ మాదిరిగానే ఫ్యూయెల్ క్యాప్‌లో ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా గణనీయమైన మార్పులు పొందే అవకాశం ఉంది.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, దీనికి సంబంధించిన ఒక ఫోటో మాత్రమే అందుబాటులో ఉంది. కావున ఇందులో పార్కింగ్ బ్రేక్ అండ్ డ్రైవ్ సెలెక్టర్‌ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో టచ్‌స్క్రీన్‌ మునుపటి మోడల్ కంటే పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. ఇందులోని మరిన్ని ఫీచర్స్ త్వరలోనే వెల్లడవుతాయి.

(ఇదీ చదవండి: ఆగని ఉద్యోగాల కోత! ఆ సంస్థ నుంచి మళ్ళీ 340 మంది..)

కొత్త టాటా పంచ్ ఇప్పటికే వినియోగంలో ఉన్న కంపెనీకి చెందిన జిప్‌ట్రాన్ పవర్‌ట్రెయిన్‌ ఉపయోగించే అవకాశం ఉంది. కావున ఇందులో లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ఉంటుంది. అయితే పవర్‌ట్రెయిన్ ఎలా ఉంటుందనే అధికారిక వివరాలు వెల్లడికాలేదు, కానీ టాటా టిగోర్ మాదిరిగా మంచి పనితీరుని అందిస్తుందని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఖరీదైన కారుకి చిన్నప్పుడు ప్రయాణించిన బస్ నెంబర్ - నెట్టింట్లో ప్రశంసలు)

టాటా పంచ్ ఈ సంవత్సరం జూన్ నాటికి ఉత్పత్తిలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ తరువాత అక్టోబర్ నెలలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ. 9.5 నుంచి రూ. 10.5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. టాటా పంచ్ ఈవీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతి పంచుకోండి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top