పిక్చర్ ఛాలెంజ్: ఫోటో పెట్టు.. రివార్డు పట్టు! | Take A Photo Get Your Reward MoRTH Tweet | Sakshi
Sakshi News home page

మంత్రిత్వ శాఖ పిక్చర్ ఛాలెంజ్: ఫోటో పెట్టు.. రివార్డు పట్టు!

Apr 6 2026 6:01 PM | Updated on Apr 6 2026 6:12 PM

Take A Photo Get Your Reward MoRTH Tweet

కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు వస్తుండటంతో.. భారతదేశ రాహదారి వ్యవస్థ నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. అయితే జాతీయ రహదారులలో పరిశుభ్రమైన మరుగుదొడ్ల ఏర్పాటు ఒక సవాలుగా మారిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి.. రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్వీట్‌లో.. MoRTH 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్'ను ప్రకటించింది. టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్ల గురించి తెలియజేయమని ప్రయాణికులను కోరింది. ఒకవేళ వినియోగదారుడు అపరిశుభ్రమైన మరుగుదొడ్లను గమనిస్తే.. దాని ఫోటోను రాజమార్గయాత్ర యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ఇలా చేస్తే.. వారికి రూ. 1,000 ఫాస్ట్‌ట్యాగ్ క్రెడిట్ లభిస్తుంది. ప్రజా మౌలిక సదుపాయాల పర్యవేక్షణలో భాగంగా.. జాతీయ రహదారులపై పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ చర్య ప్రధాన లక్ష్యం.

Advertisement
 
Advertisement
Advertisement