టాఫే చేతికి ఫోరేషియా భారత వ్యాపారం | Sakshi
Sakshi News home page

టాఫే చేతికి ఫోరేషియా భారత వ్యాపారం

Published Sat, Dec 31 2022 6:08 AM

TAFE acquires Indian interior systems business of Faurecia - Sakshi

చెన్నై: అంతర్జాతీయ ట్రాక్టర్ల తయారీ దిగ్గజం టాఫే (ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌) తాజాగా ఫ్రాన్స్‌ సంస్థ గ్రూప్‌ ఫోర్వియాలో భాగమైన ఫారేషియా భారతీయ ఇంటీరియర్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ఫోక్స్‌వ్యాగన్, టాటా మోటర్స్, హ్యుందయ్‌ తదితర ఆటోమోటివ్‌ సంస్థలకు సీటింగ్, ఇంటీరియర్స్‌ మొదలైన వాటి డిజైనింగ్, తయారీ సేవలను ఫారేషియా అందిస్తోంది.

డీల్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, మహారాష్ట్రలోని చకాన్, తమిళనాడులో ఫారేషియా ప్లాంట్లు టాఫేకు దక్కుతాయి. ఇప్పటికే అనంతపురం, చకాన్‌ ప్లాంట్లకు సంబంధించిన లావాదేవీలు పూర్తయ్యాయని, తమిళనాడు ప్లాంటు లావాదేవీ త్వరలో ముగుస్తుందని కంపెనీ తెలిపింది. తమ ప్లాస్టిక్స్‌ వ్యాపార విభాగంలో ఫారేషియా ఇంటీరియర్‌ సిస్టమ్స్‌ విలీనం ద్వారా కస్టమర్లకు మరింత ప్రయోజనకరమైన సేవలు అందించగలమని టాఫే సీఎండీ మల్లికా శ్రీనివాసన్‌ తెలిపారు.

Advertisement
Advertisement