భారత్‌లో డ్రైవర్‌లెస్‌ కారు.. రోడ్లపై రయ్‌ రయ్‌ మంటూ చక్కర్లు | Swaayatt Robots Announce Autonomous Driving Technology | Sakshi
Sakshi News home page

భారత్‌లో డ్రైవర్‌లెస్‌ కారు.. రోడ్లపై రయ్‌ రయ్‌ మంటూ చక్కర్లు

Apr 2 2024 3:17 PM | Updated on Apr 2 2024 4:42 PM

Swaayatt Robots Announce Autonomous Driving Technology - Sakshi

భోపాల్‌ : కృత్రిమమేధతో నడిచే.. డ్రైవర్‌ లేని స్వయంగా నడిచే వాహనాలు వచ్చేస్తున్నాయనే ప్రచారం ఇటీవల బాగా జరగుతోంది. నిర్లక్ష్యపు డ్రైవర్లు, మద్యం తాగి వాహనాలు నడిపేవారి నుంచి విముక్తి లభిస్తుందన్న అంచనాలు జోరుగా వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇది సులువేమీ కాదని ఏఐ నిపుణులు అంటుంటే.. భారత్‌కు చెందిన ఓ కంపెనీ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆటోమొబైల్‌ రంగంలో ఏఐ  టెక్నాలజీని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. డ్రైవర్‌లెస్‌ కారును అందుబాటులోకి తెచ్చింది.  ఇప్పుడు ఆ డ్రైవర్‌ లెస్‌ కారు భారత్‌ రోడ్లపై రయ్‌ రయ్‌ మంటూ చక్కెర్లు కొడుతుండడం విశేషం. 

సంజీవ్‌ శర్మ స్వయాత్‌ రోబోట్‌ ఫౌండర్‌, సీఈఓ తాజాగా ఆ సంస్థ గత కొన్నేళ్లుగా ఓ ప్రముఖ కార్ల తయారీ సంస్థకు చెందిన ఓ డీజిల్‌ కారుపై అనేక పరిశోధనలు చేస్తూ వచ్చింది.ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని జోడించి డీజిల్‌ వేరియంట్‌ కారును అటానమస్‌ డ్రైవర్‌ లెస్‌ కారుగా మార్చేశారు. 

ఈ సందర్భంగా భోపాల్‌లోని కంకాళి కాళీ మాత దేవాలయం నుంచి ఇరుకు సందుల్లో, రోడ్లమీద ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసుకుంటూ డ్రైవర్‌ లెస్‌ కారు ప్రయాణాన్ని జీపీఎస్‌తో నావిగేట్‌ చేస్తున్న వీడియోని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ వీడియోలో ఎదురుగా వస్తున్న వాహనాల్ని ఢీకొట్టకుండా పక్కకి వెళ్లడం, జనావాసాల్లో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ముందుకు కారు ప్రయాణించడం మనం గమనించవచ్చు. 

అయితే దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీ టెస్లాతో పాటు ఇతర కంపెనీలు డ్రైవర్‌ లెస్‌ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటే స్వయాత్‌ రోబోట్‌ డీజిల్‌ కారును డ్రైవర్‌లెస్‌ కారు మార్చడమే కాకుండా విజయవంతంగా డ్రైవ్‌ చేయించడంపై ఆటోమొబైల్‌ కంపెనీలు అధినేతలు, టెక్నాలజీ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement