స్టడ్స్‌ రూ.455 కోట్ల ఐపీవో | Studds Accessories IPO price band set at Rs 557 585 | Sakshi
Sakshi News home page

స్టడ్స్‌ రూ.455 కోట్ల ఐపీవో

Oct 31 2025 2:26 PM | Updated on Oct 31 2025 3:17 PM

Studds Accessories IPO price band set at Rs 557 585

న్యూఢిల్లీ: హెల్మెట్ల తయారీ కంపెనీ స్టడ్స్‌ యాక్సెసరీస్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 557–585 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 30న ప్రారంభమైన ఇష్యూ నవంబర్‌ 3న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 455 కోట్ల విలువైన 77.86 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేస్తున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకి అందబోవు. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 29న షేర్లను ఆఫర్‌ చేయనుంది.

1975లో ఏర్పాటైన కంపెనీ ద్విచక్ర వాహన హెల్మెట్ల డిజైన్, తయారీ, మార్కెటింగ్‌ తదితరాలను చేపడుతోంది. స్టడ్స్, ఎస్‌ఎంకే బ్రాండ్లతో వీటిని విక్రయిస్తోంది. అంతేకాకుండా మోటార్‌సైకిల్‌ సంబంధ లగేజీ, గ్లోవ్స్, రెయిన్‌ సూట్స్, రైడింగ్‌ జాకెట్స్, ఐవేర్‌ తదితర యాక్సెసరీస్‌ను రూపొందిస్తోంది. స్టడ్స్‌తో మాస్‌ మార్కెట్‌పై దృష్టి పెట్టగా.. ప్రీమియం విభాగంలో ఎస్‌ఎంకేను 2016లో ప్రవేశపెట్టింది. కంపెనీ ఇంతక్రితం 2018 చివర్లో ఐపీవోకు దరఖాస్తు చేసి సెబీ నుంచి అనుమతి పొందింది. అయితే ఇష్యూకి రాకపోవడం గమనార్హం! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement