సాక్షి మనీ మంత్ర: మంచి లాభాలతో ముగిసిన మార్కెట్లు.. ఈ షేర్లదే హవా! | stock market update 28 march sakshi money mantra | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: మంచి లాభాలతో ముగిసిన మార్కెట్లు.. ఈ షేర్లదే హవా!

Mar 28 2024 3:50 PM | Updated on Mar 28 2024 3:56 PM

stock market update 28 march sakshi money mantra - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ బెంచ్‌ మార్క్‌ స్టాక్‌ సూచీలు ట్రేడింగ్ సెషన్‌ను సానుకూలంగా ముగించాయి. ఎన్‌ఎస్‌సీ నిఫ్టీ 219.85 పాయింట్లు లేదా 0.99% లాభపడి 22,343.50 వద్ద స్థిరపడగా, బీఎస్‌ఈ సెన్సెక్స్ 655.04 పాయింట్లు లేదా 0.90% జంప్ చేసి 73,651.35 వద్దకు చేరుకుంది. 

లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్‌లు లాభపడటంతో విస్తృత సూచీలు సానుకూలంగా ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 338.65 పాయింట్లు లేదా 0.72 శాతం పెరిగి 47,124.60 వద్ద స్థిరపడింది. మీడియా స్టాక్స్ నష్టాలను చూడగా ప్రభుత్వ బ్యాంకులు, ఆటో స్టాక్స్ ఇతర రంగాల సూచీల కంటే మెరుగైన పనితీరు కనబరిచాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement