నాలుగో రోజూ భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..! | Stock Market: Sensex Ends 427 Points Lower, Nifty Below 17617 | Sakshi
Sakshi News home page

నాలుగో రోజూ భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

Jan 21 2022 4:19 PM | Updated on Jan 21 2022 4:19 PM

Stock Market: Sensex Ends 427 Points Lower, Nifty Below 17617 - Sakshi

ముంబై: దేశీయ స్టాక్​ మార్కెట్లు నాలుగో రోజూ కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కాస్త కొలుకున్నట్లు కనిపించి ఆ తర్వాత మళ్లీ పడిపోయాయి. పెరిగిన కరోనా కేసులు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గ్లోబల్‌ సూచీలు దిద్దుబాటుకు గురి అవుతుండటం, దీనికి తోడు చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ భయాలు మదుపర్లను కలవరపెట్టాయి. దీంతో సెన్సెక్స్​ 427 పాయింట్లకు పైగా.. నిఫ్టీ 139 పాయింట్లకు పైగా పతనమయ్యాయి.

చివరకు, బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్​ 427 పాయింట్లు కోల్పోయి 59,037 వద్ద నిలిస్తే, సూచీ నిఫ్టీ 139 పాయింట్లు క్షీణించి 17,617 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం వీలువ రూ.74.39 వద్ద ఉంది.  నేడు నిఫ్టీలో హిందుస్థాన్​ యూనిలీవర్​, మారుతీ, హెచ్​డీఎఫ్​సీ, నెస్లే, కోటక్​ మహీంద్రా బ్యాంక్​ షేర్లు రాణిస్తే.. బజాజ్​ ఫిన్​సర్వ్​, టెక్​ మహీంద్ర, టాటా స్టీల్​, భారతీ ఎయిర్​ టెల్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

(చదవండి: వచ్చే 12 నెలల్లో రూ.1,50,000కు చేరుకొనున్న బంగారం ధర..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement