ఇన్వెస్టర్లకు ఫ్రై డే | Stock market crash: Nifty Drops 364 Points and Sensex Falls 1176 | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లకు ఫ్రై డే

Dec 21 2024 1:46 AM | Updated on Dec 21 2024 7:53 AM

Stock market crash: Nifty Drops 364 Points and Sensex Falls 1176

ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల సంపద హుష్‌..

బేర్‌ గుప్పిట్లోనే దలాల్‌ స్ట్రీట్‌  

అయిదో రోజూ నష్టాలే 

సెన్సెక్స్‌ 1,176 పాయింట్లు క్రాష్‌ 

నిఫ్టీ 364 పాయింట్ల పతనం

ముంబై: దేశీయ స్టాక్‌ సూచీలను వరుసగా అయిదో రోజూ నష్టాలు వెంటాడాయి. వచ్చే ఏడాదిలో ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చనే ఫెడ్‌ రిజర్వ్‌ సంకేతాలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలతో శుక్రవారమూ కుప్పకూలాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 1,176 పాయింట్లు క్షీణించి 79 వేల పాయింట్ల స్థాయి దిగువన 78,042 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ 364 పాయింట్లు నష్టపోయి 23,588 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ ఒకటిన్నర శాతం పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ. 10 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.   సెన్సెక్స్‌ 1,344 పాయింట్లు క్షీణించి 77,875 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు కోల్పోయి 23,537 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. ఆసియాలో ఇండోనేషియా మినహా అన్ని దేశాల సూచీలు 3% వరకు పతనయ్యాయి. యూరప్‌ మార్కెట్లు 1% నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి విలువ 9 పైసలు బలపడి 85.04 వద్ద ముగిసింది. 

5 రోజుల్లో రూ.18.43 లక్షల కోట్ల నష్టం 
స్టాక్‌ మార్కెట్‌ వరుసగా 5 రోజుల్లో సెన్సెక్స్‌ 4,091 పాయింట్ల (5%) కుదేలవడంతో రూ.18.43 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్‌ఈలోని మొత్తం లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.440.99 లక్షల కోట్లకు దిగివచి్చంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement