తక్కువ ప్రీమియంలతో కొత్త ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ | star health launches low premium insurance plan value plus | Sakshi
Sakshi News home page

తక్కువ ప్రీమియంలతో కొత్త ఇన్సూరెన్స్‌ ప్లాన్‌

May 25 2026 10:23 AM | Updated on May 25 2026 10:30 AM

star health launches low premium insurance plan value plus

ఆరోగ్య బీమా సంస్థ స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ తాజాగా వేల్యూ ప్లస్‌ పేరిట అందుబాటు ప్రీమియంలతో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. మెట్రోయేతర మార్కెట్లు, అలాగే టియర్‌ 2, 3, 4 మార్కెట్లలో దాదాపు 20 శాతం తక్కువ ప్రీమియంలతో ఇది లభిస్తుంది. ఇండివిడ్యువల్‌, ఫ్యామిలీ ఫ్లోటర్లకు సంబంధించి రూ. 7.5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు కవరేజీ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుందని సంస్థ ఎండీ ఆనంద్‌ రాయ్‌ తెలిపారు.  

వరుసగా 5 ఏళ్ల పాటు ఇన్‌–పేషంట్‌ క్లెయిమ్‌లేమీ లేకపోతే మొదటి ఏడాది కట్టిన బేస్‌ ప్రీమియంను వాపసు పొందవచ్చు. అత్యధిక సమ్‌ ఇన్సూర్డ్‌ ఆప్షన్లు, మెరుగైన హెల్త్‌కేర్‌ ప్రయోజనాల మేళవింపుతో కస్టమర్లకు ఆరోగ్య బీమాను మరింతగా అందుబాటులోకి తేవడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ తెలంగాణ బిజినెస్‌ హెడ్‌ కె.బీ.బీ శ్రీనివాస్‌ తెలిపారు.

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి గుర్తుగా ఈ ‘వేల్యూ ప్లస్’ ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. యువతను, చిన్న పట్టణాల ప్రజలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఈ పాలసీలో పలు ప్రత్యేక ఫీచర్లను చేర్చారు. ఇందులో పాలసీ తీసుకున్న నాటి వయస్సు ఆధారంగానే ప్రీమియంను లాక్ చేసే 'ఫ్రీజ్ యువర్ ఏజ్' సదుపాయం ఉంది. దీనివల్ల మొదటి క్లెయిమ్ చేసే వరకు లేదా 55 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం ధరలు పెరగవు. దేశవ్యాప్తంగా 11,000కు పైగా నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత (క్యాష్‌లెస్) చికిత్స పొందే వీలుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement