మరో అద్భుతమైన ఫీచర్‌తో స్నాప్‌చాట్‌!

Snapchat Now Allows The Creators To Show The Subscribers - Sakshi

స్నాప్‌చాట్‌లో ఇకపై సబ్‌స్రైబర్స్‌ సంఖ్య కనబడనుంది. క్రియేటర్లకు ఆ అవకాశాన్ని కల్పిస్తూ ప్రముఖ యాప్‌ అనుమతినిచ్చింది.  ఇది స్నాప్‌చాట్‌ సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు స్నాప్‌చాట్‌లో సబ్‌స్రైబర్స్‌ను చూసే అవకాశం లేదు.  ప్రసుత్తం యాప్‌ను అప్‌డేట్‌ చేసి క్రియేటర్స్‌కు   తమకు ఉన్న సబ్‌స్రైబర్స్‌ను బహిర్గతం చేసే అవకాశాన్ని కల్పించింది. ఎలాంటి సోషల్‌మీడియా నిషేధాలు లేకుండా సన్నిహితులు ఉపయోగించుకోవడానికి ఇది ఒక మంచి యాప్‌ అని చెప్పవచ్చు. 

ప్రస్తుతం స్నాప్‌చాట్‌లో ఈ అప్‌డేట్‌ కనిపిస్తోంది. ఈ యాప్‌లో క్రియేటర్స్‌ను స్నాప్‌ స్టార్స్‌  అని కంపెనీ సంబోధిస్తుంది.  క్రియేటర్స్‌ కంటెంట్‌ డిస్కవరీ అనే విభాగంలో కనిపిస్తోంది. అదేవిధంగా సెర్చ్‌ అప్షన్‌ ద్వారా కూడా మీరు కావలసిన క్రియేటర్స్ కోసం వెతకవచ్చు. సెర్చ్‌ బార్‌ దగ్గర స్నాప్‌చాట్‌ ప్రసిద్ధ స్నాప్‌స్టార్స్‌ను కూడా చూపెడుతోంది.   ఇక క్రియేటర్‌కు ఎంత మంది సబ్‌స్రైబర్స్‌ ఉన్నారో తెలుసుకోవాలంటే వారి ప్రొఫైల్‌ మీద ప్రెస్‌ చేయాలి. 

 చదవండి: క్షమాపణలు చెప్పిన స్నాప్‌చాట్‌, కారణం?

స్నాప్‌చాట్‌లో కొత్తగా వచ్చిన ఈ అప్‌డేట్‌ వలన వివిధ రకాల సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాంలలో ప్రముఖులకు ఉన్న ఫాలోవర్స్‌ను స్నాప్‌చాట్‌లో ఉన్న ఫాలోవర్స్‌తో పోల్చి చూసుకోవచ్చు.  అయితే చాలా మంది క్రియేటర్స్‌ తమ ఫాలోవర్స్‌ సంఖ్యను తెలిపే అవకాశం ఇవ్వాలని కోరడంతో ఈ అప్‌డేట్‌ను తీసుకువచ్చినట్లు స్నాప్‌చాట్‌ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం స్నాప్‌చాట్‌ వినియోగం పెరుగుతోంది. భారతదేశంలో దీని వినియోగం రెట్టింపు అయ్యింది. 

చదవండి: ‘మానసిక సమస్యలకు స్నాప్‌‌చాట్‌ ఫీచర్’‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top